Friday, November 22, 2024

కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా?

క‌రోనా వైరస్ కారణంగా ఒకరిని ఒకరు పలకరించుకోవాలన్నా భ‌య‌ప‌డే ప‌రిస్థితిని నెలకొంది. బంధువులు, స్నేహితులు మ‌ర‌ణించినా కూడా చివ‌రిచూపు చూసేందుకు వెళ్ల‌డానికి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి స‌మ‌యంలో క‌రోనా వైర‌స్‌తోనే మ‌ర‌ణించిన వారి ద‌హ‌న సంస్కారాల‌కు వెళ్లొచ్చా? క‌రోనా మృతుల నుంచి వైర‌స్ వ్యాపిస్తుందా? అన్న సందేహం చాలామందిలోనే ఉంది. దీనికి పలువురు వైద్యనిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

చ‌నిపోయిన వారి నుంచి వైర‌స్ వ్యాప్తి చెందే అవ‌కాశం ఉండ‌దని నిమ్స్ ఆస్పత్రి వైద్యుడు శ్రీభూషణ్‌రాజు వెల్లడించారు. కాబ‌ట్టి అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లేందుకు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదన్నారు. ద‌హ‌న సంస్కారాల‌కు వెళ్లిన స‌మ‌యంలో అంద‌రూ గుంపులుగా చేర‌డం వ‌ల్ల ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వైర‌స్ వ్యాప్తి చెందుతుందని.. కాబట్టి సామాజిక దూరం పాటించాలన్నారు. అంతే త‌ప్ప చ‌నిపోయిన వ్యక్తుల ద్వారా వైర‌స్ వ్యాప్తి జ‌ర‌గ‌దని స్పష్టం చేశారు.

ఒక వ్య‌క్తి ద‌గ్గిన‌ప్పుడు లేదా తుమ్మిన‌ప్పుడు వ‌చ్చే తుంపర్ల ద్వారా SARS CoV-2 వ్యాప్తి చెందుతుందని, అయితే మృత‌దేహాల్లోనూ స‌లైవా, క‌ఫం వంటి ద్ర‌వాలు ఉంటాయని శ్రీభూషణ్ రాజు తెలిపారు. అయితే మృత‌దేహాన్ని ప‌ట్టుకొని లేదా మీద ప‌డి ఏడ్చిన‌ప్పుడు అవి మన‌కు అంటి వైర‌స్ వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంటుందని.. అందుకోస‌మే క‌రోనా మృత‌దేహాల‌కు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించిన‌ప్పుడు జాగ్ర‌త్తలు తీసుకుంటూ ఎవ‌రినీ అనుమ‌తించ‌డం లేదని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement