– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
తనపై ఏ ఒక్క ఆరోపణ రుజువైనా తానే ఉరి వేసుకుంటానని, మీ వద్ద (రెజ్లర్లు) ఏవైనా ఆధారాలుంటే కోర్టుకు సమర్పించాలన్నాడు బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్. నేరం రుజువైతే తాను ఎలాంటి శిక్షనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని ఇవ్వాల జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపాడు. ఇదే విషయాన్ని తాను ఇంతకు ముందు కూడా చెప్పానని, ఇప్పుడు కూడా అదే మాటకు కట్టుబడి ఉంటా అన్నాడు.
డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్‌పై వచ్చిన ఆరోపణలను ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేంత శక్తి లేదని ఢిల్లీ పోలీసు ఉన్నత వర్గాలు తెలిపాయని వార్తా సంస్థ ANI నివేదించింది. అతను సాక్షిని ప్రభావితం చేయడం లేదని, సాక్ష్యాలను నాశనం చేయడం లేదని ఒక అధికారి చెప్పినట్టు ఆ వార్త సంస్థ పేర్కొంది.
కాగా, ఎఫ్‌ఐఆర్‌లో తెలిపిన పోక్సో (లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం, 2012) కింద సెక్షన్లు ఏడేళ్ల కంటే తక్కువ జైలుశిక్షను కలిగి ఉన్నాయి. కాబట్టి నిందితుల డిమాండ్ మేరకు అతడిని అరెస్టును చేయలేము అని పోలీసు అధికారి తెలిపారు. 15 రోజుల్లో తాము కోర్టులో నివేదికను దాఖలు చేస్తామని, అది ఛార్జ్ షీట్ కావచ్చు, ఫైనల్ రిపోర్టు అయినా కావచ్చు అని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి.