పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా ముగిసిన తర్వాత సీఏఏను అమలు చేస్తామని మంత్రి అమిత్ షా ప్రకటించారు. పశ్చిమబెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటి సారి అమిత్ షా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. న్యూ జలపాయ్ గురిలో ర్యాలీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ సర్కారు చొరబాట్లను అనుమతిస్తోందని ఆరోపించారు. చొరబాట్లను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంధనంపై స్థానిక సుంకాన్ని తగ్గించనందున భారతీయ జనతా పార్టీ (బిజెపి) పాలిత రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్‌లో పెట్రోల్ , డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని అమిత్ షా పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement