Tuesday, November 19, 2024

Wild Life: జంతు గణన ముగిసింది.. పులుల లెక్క తేలింది..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ సూచన మేరకు రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వ ర్యంలో చేపట్టిన జంతు గణన ముగిసింది. వారం రోజుల పాటు నిర్వహించిన జంతు గణనను ముగించి డేటాను ప్రత్యేక ఎకలాజికల్‌ యాప్‌లో నిక్షిప్తం చేసినట్లు అటవీశాఖాధికారి ఒక‌రు ఆంధ్రప్రభకు చెప్పారు. మరో నెల రోజుల పాటు యాప్‌లో నమోదైన డేటాను పరిశీలించి, అనంతరం ఆ డేటాను డెహ్రడూన్‌లోని వైల్డ్‌ లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌కు పంపుతామన్నారు. వివిధ దశలలో డేటా మొత్తాన్ని పరిశీలిం చిన అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న పులులు, వన్యప్రాణుల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుందని ఆయన తెలిపారు. అంతవరకు భద్రతా కారణాల దృష్ట్యా జంతుగణన వివరాలను వెల్లడించబోమని ఆయన స్పష్టం చేశారు.

మొత్తం 12 అటవీ సర్కిళ్ళలో పరిధిలో 3018 బీట్లలో సర్వే నిర్వహిం చినట్లు ఆయన తెలిపారు. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు అభయా రణ్యంలోని ఎనిమిది రేంజ్‌ల పరిధిలో కొల్లాపూర్‌, మన్ననూ రు, లింగాల, అచ్చంపేట, మద్ది మడుగు, దోమలపెంట చుట్టుపక్కల ప్రాంతాల్లో మాం శాహార, శాఖాహార జంతువుల కదలికలను నమోదు చేశామన్నారు. మొదటి మూడు రోజులు మాంశాహార జంతువుల పాదముద్రికలు, విసర్జిత పదార్ధాలు ఆన వాళ్ళు, వెంట్రుకలు, గోరులు వంటి వాటిని గుర్తిం చామని, తర్వాత మూడు రోజులు డైరెక్ట్‌ సైటింగ్‌లో భాగంగా శాఖాహార జంతు వుల ఆవాసా లతో పాటు ప్రతి నాలుగు మీటర్ల పరిధిలోని చెట్లు, పొదలు, గడ్డి జాతుల క్షేత్రా లను గుర్తించామన్నారు. ఈసారి పేవర్‌ వర్క్‌ లేకుండానే క్షేత్రస్థా యి సర్వే ఆధారంగా జంతువుల ఫోటోలు, అరుపులు, ప్రత్యేక్షం గా చూడటం, స్థానికులను అడిగి వివరాలను తెలుసు కోవడం వంటి పద్దతులను అనుసరిస్తూ ఎకలాజికల్‌ యాప్‌లో వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేశారు. అటవీశాఖ సిబ్బంది రోజూ సుమారు నాలుగై దు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్ళి వన్యప్రాణు లు, పులులు వంటి జంతువుల ఆధారాలను గుర్తిస్తారు.

ఐదు రకాల పద్దతుల్లో జంతు గణాంకాలను సేకరిస్తారు
ఐదు రకాల పద్దతుల్లో జంతు గణాంకాలను అట వీ సిబ్బంది సేకరిస్తారు. అటవీ సిబ్బంది నడిచే మార్గం లో కనిపించిన వన్యప్రా ణుల గుర్తులతో పాటు ఏ ప్రదేశం లో ఎంత సమయానికి కనిపిం చాయనే అంశా లను నమోదు చేసుకుంటారు. చెట్లు, రాళ్ళుకు శరీరా న్ని, పాదాలను అడవి జంతువులు రుద్దుకుం టాయి. గోళ్లు పెరిగినప్పుడు వాటిని తగ్గించు కునేందు కు, శరీ రంపై దురదను పోగొ ట్టు కోవడానికి జంతులు ఇలా చేస్తుం టాయి. ఆ సమ యంలో వాటి వెం ట్రుకలు, గోళ్ళు ఊడి పో తాయని అధి కారులు చెబు తున్నారు. చెట్లు, రాళ్ళ పై పడ్డ గాట్లను అటవీ సిబ్బం ది పరిశీలించి అక్కడ సంచ రిం చిన జంతువు ఏదో గుర్తించ గల్గు తా రు. అలాగే సేకరించిన వెంట్రు కలు, గోళ్ళకు డిఎన్‌ఏ పరీక్షలు నిర్వ హించి ఆ జంతువు ఏదన్నది నిర్ధారిస్తారు. అడవు ల్లో కనిపించే పులల మలాన్ని సేకరించి, సిలికాన్‌ జెల్‌ డబ్బాలో భద్రపరిచి సిసిఎంబీకి పంపిస్తారు. అక్కడ డిఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి పులుల సంఖ్య తోపాటు వారి ఆరోగ్య స్థితిని గమ నిస్తారు.

పులుల పాదము ద్రికల బట్టి వయస్సు ను నిర్దారి స్తారు. ఒక గాజు పలకపై స్కెచ్‌పెన్‌తో పాదముద్ర ఆకారాన్ని గీసి, దానిపై తెల్ల నికాగితాన్ని పరిచి ఆకారాన్ని దానిపై పడేలా చూస్తా రు. నేలపై పాదముద్ర చుట్టూ ఓ రింగు ను ఏర్పాటు చేసి పాద ముద్రపై పౌడర్‌ చల్లు తారు. అనంతరం రింగు అంతా ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ మిశ్రమా న్ని వేస్తారు. ఓ 20 నిమిషాల తర్వాత మిశ్రమం గట్టిపడి అచ్చులా ఏర్పడుతుంది. దీంతో పాదముద్రలు ఏ ప్రాం తంలో , ఏ సమయంలో గుర్తించినది అనే వివ రాలను నమోదు చేసుకుంటారు. పాదముద్ర ఎన్ని సెం టీమీటర్లు మేర ఉందనేదాన్ని బట్టి పులి వయస్సును నిర్ణయిస్తారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement