జీవితం అన్నాక ఎన్నో ఊహించని పరిణామాలు ఎదురవుతుంటాయి. లైఫ్ లో ఎప్పుడు ఏం జరుగుంతుందో తెలియడం కష్టమే. కాగా పంజాబ్ కి చెందిన మన్ దీప్ కౌర్ కి వివాహం జరిగింది. అయితే పెళ్లి తర్వాత ఆమె పరిస్థితి మారిపోయింది. ఊహించని విధంగా ముఖంపై గుబురు గడ్డం వచ్చింది. ఈ పరిణామాన్ని తట్టుకోలేని ఆమె భర్త విడాకులిచ్చేశాడు. ఇలా అనూహ్యంగా జీవితం తలకిందులు అవడంతో మన్దీప్ తీవ్ర దుఃఖంలో కూరుకుపోయింది. బతుకంతా నిరాశలోనే గడిపేయ వద్దనుకున్న ఆమె తనలోని మార్పులను సానుకూల ధోరణితో స్వీకరించింది. దైవ ప్రార్థనతో ప్రతికూల భావాలను తొలగించుకుంది. రోజూ గురుద్వారాకు వెళ్లడంతో తనలో మార్పు మొదలైందని మన్దీప్ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఆమె గడ్డం తీసుకోవడం కూడా మానేసింది. తనను తొలిసారి చూసిన వారందరూ పురుషడే అనుకుంటారని చెప్పింది.
ప్రస్తుతం మగాళ్లలాగానే బైక్ నడుపుతానని, తన సోదరులతో కలిసి పొలం పనులకు వెళతానని కూడా ఆమె వివరించింది. దీంతో..ఈ వార్త వైరల్‌గా మారింది. గతంలోనూ కొందరు మహిళలు ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారు. బ్రిటన్‌లో స్లో ప్రాంతానికి చెందిన హర్నామ్ కౌర్‌కు పాలీసిస్టిక్ ఓవరీస్ అనే వ్యాధి ఉంది. దీంతో.. చిన్నవయసులోనే ఆమె ముఖంపై రోమాలు మొలవడం ప్రారంభించాయి. తన పదకొండవ ఏటనే ఈ సమస్య మొదలైంది. రోమాలను తొలగించుకునేందుకు ఆమె తరచూ వ్యాక్సింగ్ చేసేది. కొన్నేళ్ల పాటు ఇలా చేసి విసిగిపోయిన హర్నామ్ చివరకు పరిస్థితులకు అలవాటు పడటడమే కాకుండా తన గడ్డాన్ని గర్వంగా ప్రదర్శించేందుకు నిశ్చయించుకుంది. వారికి వారే ధైర్యం చెప్పుకుని పరిస్థితులను తమ చేతుల్లోకి తీసుకుని ధైర్యంగా ముందుకు పోతున్నారు ఇలాంటి మహిళలు.