Friday, November 22, 2024

శ్రీలంక తాత్కాలిక అధ్య‌క్షుడిగా ర‌ణిల్ విక్ర‌మ‌సింఘే-ప్ర‌మాణ‌స్వీకారం చేయించిన ప్ర‌ధాన న్యాయ‌మూర్తి

శ్రీలంక తాత్కాలిక అధ్య‌క్షుడిగా బాద్య‌త‌లు స్వీక‌రించారు ర‌ణిల్ విక్ర‌మ‌సింఘే. ఆయ‌నతో శ్రీలంక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌యంత జ‌య‌సూర్య ప్ర‌మాణ స్వీకారం చేయించారు. కాగా గొటబాయ రాజపక్సే అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు పార్లమెంట్ స్పీకర్ మహీంద యాపా అబే వర్ధనే అధికారికంగా ప్రకటించారు. తన అసంబద్ధ నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి, దేశాన్ని దివాలా తీయించారని గొటబాయ ప్రజాగ్రహానికి గురయ్యారు. ఆయనకు వ్యతిరేకంగా దేశంలో చాన్నాళ్ల నుంచి పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో, గొటబాయ దేశం విడిచి పారిపోయారు. ఆయన దేశాన్ని విడిచి వెళ్లిన రెండు రోజుల్లోనే తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ బాధ్యతలు తీసుకోవడంతో శ్రీలంక పరిస్థితి గాడిలో పడే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంటు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ముగిసే వరకు ప్రధాని రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని స్పీకర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement