Saturday, November 23, 2024

AirLines: అంతర్జాతీయ ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. ఎయిర్​ సువిధ డిక్లరేషన్​ రద్దు చేస్తూ నిర్ణయం

ఇండియాకు వచ్చే అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు భారత విమానయాన సంస్థ గుడ్​న్యూస్​ చెప్పింది​. కొవిడ్​ మహమ్మారి కారణంగా  2020 ఆగస్టులో భారతదేశం ఎయిర్ సువిధ పోర్టల్‌ను ప్రారంభించింది. 2021 నవంబర్ 30వ తేదీన దీనికి కొన్ని కండిషన్స్, రూల్స్​ని యాడ్​ చేశారు. ​అప్పటి నుంచి నిబంధనలు కఠినతరం చేశారు. దీంతో  విమాన ప్రయాణికులు బోర్డింగ్​కు 72గంటల ముందు ఆర్​టీపీసీఆర్​ పరీక్ష తప్పనిసరి చేసుకోవాల్సి ఉండేది. ఇక.. కొవిడ్​ వ్యాక్సిన్​ సర్టిఫికెట్​ కూడా చూపించాల్సి ఉండేది. ఈ రూల్స్​ని తొలగిస్తూ ఇప్పుడు ఆంక్షలను సడలించినట్టు అధికారులు తెలిపారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

కొద్దిరోజులుగా దేశంలో కొవిడ్-19 కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నవంబర్ 22వ తేదీనాటి లెక్కల ప్రకారం.. యాక్టివ్ కేసులు 6,209కి తగ్గాయి. 24 గంటల వ్యవధిలో యాక్టివ్ కేస్​ లోడ్​ 193 కేసులుగా నమోదయ్యింది. దీంతో భారత్‌కు వెళ్లే అంతర్జాతీయ విమాన ప్రయాణికులు ఇక మీదట తప్పనిసరి ఎయిర్ సువిధ ఫారమ్‌ను నింపి సమర్పించాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఫారం నింపడాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కూడా దీనికి సంబంధించిన ఒక ప్రకటన విడుదల చేసింది.  

సవరించిన మార్గదర్శకాల ప్రకారం.. ప్రయాణికులు ఇకపై ఆన్‌లైన్ ఎయిర్ సువిధ ఫారమ్‌ను ఫిల్​ చేసి సమర్పించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఫారమ్ రద్దు చేయనప్పటికీ.. ఎప్పటికప్పుడు మారుతున్న కొవిడ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అవసరమైతే నియమాన్ని సమీక్షించవచ్చని విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఎయిర్ సువిధ అంటే ఏమిటి?

- Advertisement -

ఎయిర్ సువిధ ఫారమ్ అనేది భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరూ తప్పనిసరిగా పూరించవలసిన సెల్ఫ్​-డిక్లరేషన్ ఫారమ్. ఈ ఫారమ్‌లో ప్రయాణికులు తమ వ్యక్తిగత వివరాలు, కొవిడ్ టీకా వేసుకున్న చివరి మోతాదు.. RT-PCR పరీక్ష తీసుకున్న తేదీ (బోర్డింగ్‌కు 72 గంటల ముందు), అలాగే గత 14 రోజుల ప్రయాణ వివరాలను వెల్లడించాలి. వీటితో పాటు ఇమెయిల్ ID, పాస్‌పోర్ట్ నెంబర్ కూడా జతచేయాల్సి ఉండేది. 

అంతేకాకుండా ఐదు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సున్న పిల్లలతో సహా ప్రయాణికులు భారతదేశానికి వచ్చే విమానం ఎక్కే ముందు RT-PCR పరీక్ష కచ్చితంగా చేయించుకోవాలి. ఈ క్రమంలో కొన్ని దేశాల్లో ఈ పరీక్షలు చాలా ఖరీదైనవిగా ఉండడం ప్రయాణికులకు ఆర్థిక భారంగా మారింది. మాల్దీవులలో అయితే.. RT-PCR పరీక్షకు రూ. 7,000 దాకా ఖర్చవుతుందని ప్రయాణికులు చెబుతున్నారు. అప్పట్లో కొవిడ్ -19 వైరస్ వ్యాప్తిని ట్రాక్​ చేయడానికి ప్రభుత్వం ఎయిర్​ సువిధ ఫారమ్‌ను సమర్పించడం తప్పనిసరి చేసింది. ఇది పోర్టల్‌లో కాంటాక్ట్ లెస్ సెల్ఫ్ డిక్లరేషన్ గా ఉంటుంది.

ఎందుకు ఆపేశారంటే..

ఫెడరేషన్ ఆఫ్ హోటల్ & రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా కేంద్రానికి ఓ విజ్ఞప్తి చేసింది. కరోనా మహమ్మారి నియంత్రణలో ఉన్నప్పటికీ విమానయాన శాఖ పెడుతున్న కొన్ని సీరియస్​ కండిషన్స్​ వల్ల టూరిజం పరిశ్రమను ప్రభావితం అవుతోందని, దీంతో ఎయిర్ సువిధ ఫారమ్‌ ఫిల్​ చేయడాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. వారు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కూడా కలుసుకున్నారు. అంతర్జాతీయ ప్రయాణికులు ఫారమ్‌ను సమర్పించడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారని వారి ఇబ్బందులను వివరించారు. ఇంతకు ముందు విమానాల్లో మాస్క్ ల వాడకం తప్పనిసరిగా ఉండేది. కానీ, గత వారం విమానయాన మంత్రిత్వ శాఖ విమాన ప్రయాణికులకు మాస్క్ ల వాడకం తప్పనిసరి కాదని ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement