పెట్రో ధరలు విపరీతంగా పెరిగిపోవడం, దీనికి తోడు కాలుష్యం కూడా ఎక్కువ కావడంతో కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టింది. ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్రం విపరీతంగా ప్రచారం చేస్తోంది. ప్రజల్లో అవగాహన కూడా కల్పిస్తోంది. దీంతో ప్రజలు కొంతలో కొంత ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడం ప్రారంభించారు. అయితే.. ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఫైర్ అవుతున్నాయి. చార్జింగ్ పెట్టేటప్పుడు షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమవుతున్నాయి. దీంతో వాటిని కొనుగోలు చేసేందుకు చాలామంది భయపడుతున్నారు. ఇట్లా ఓలా స్కూటర్. ఓకినావా స్కూటర్ లో అగ్ని ప్రమాదాలు సంభవించాయి. దీని ద్వారా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి.
ఈ మధ్య ఎలక్ట్రిక్ వాహనాలు దగ్ధమైపోతుండటంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఇలాంటి ఘటనలను సీరియస్‌గా తీసుకుంటున్నామని, వీటి విషయంలో పూర్తి విచారణ చేయాలని డీఆర్డీవోను కేంద్రం ఆదేశించింది. దీంతో డీఆర్డీవోకి చెందిన సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ అధికారులు విచారణను ప్రారంభిస్తారు. ఇలా ఎలక్ట్రిక్ వాహనాలు అగ్ని ప్రమాదానికి ఎందుకు గురవుతున్నాయి? వాటి నుంచి బయటపడటం ఎలా? అన్న విషయాన్ని కేంద్రం కూడా ఆలోచిస్తోంది.