‘‘దేశంలో ఏం జరుగుతోంది? ఎందుకులా చేస్తున్నారు? ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఆ కాల్చివేతలు ఏంటి? అమిత్‌షా గారూ మీకేమీ అనిపిస్తలేదా? మాకైతే భయంగా ఉంది”అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు సీనియర్ అడ్వొకేట్, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్. ట్విట్టర్ వేదికగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లారు. 2017 నుంచి 2022 వరకు పోలీసు కస్టడీలో 41 మంది చనిపోయారని పేర్కొన్నారు.
అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ..
- పోలీసు కస్టడీలో ఉండగానే లక్నో కోర్టులో జివా అనే అతడిని కాల్చి చంపేశారు..
- పోలీసు కస్టడీలో ఉండగానే అతిఖ్, అశ్రఫ్ని కాల్చి చంపేశారు..
- తిహార్‌లో తుల్లు తాజ్పురియాని కాల్చి చంపేశారు..
‘‘అమిత్ జీ.. ఆర్ యూ నాట్ వర్రీడ్..? కానీ, మాకు భయమైతాంది!!’’
అంటూ యూపీలో జరుగుతున్న దారుణాలను ట్విట్టర్లో ప్రశ్నించారు కపిల్ సిబల్..
ఈ ట్వీట్‌పై వేలాది మంది రెస్పాండ్ అవుతున్నారు. లైకులు, షేర్లతో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నారు.