Thursday, November 21, 2024

పెరుగుతోన్న క‌రోనా కేసులు – అప్ర‌మ‌త్తంగా ఉండండి – ‘డ‌బ్ల్యూ హెచ్ వో’

మ‌రోసారి ప్ర‌పంచ దేశాల‌ను అప్ర‌మ‌త్తం చేస్తోంది ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ డ‌బ్ల్యూ హెచ్ వో. ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవిడ్-19 టెక్నికల్ లీడ్ మారియా వ్యాన్ ఖెర్కోవ్ స్పందించారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన వారాల వ్యవధిలో మళ్లీ పెరుగుతున్నాయని ఆమె తెలిపారు. కరోనా టెస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పటికీ కేసులు ఎక్కువగా రిపోర్ట్ కావడం ఆందోళనకరం అని వివరించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి బలంగా సాగుతున్నట్టు ఆమె అంచనా వేశారు. ముఖ్యంగా కరోనా ఆంక్షలు ఎత్తేసిన ప్రాంతాల్లో కేసులు విపరీతంగా రిపోర్ట్ అవుతున్నాయని ఆమె తన ట్విట్ట‌ర్ ఖాతాలో తెలిపారు. టీకా పంపిణీ సమృద్ధిగా జరిగినా కరోనా ఆంక్షలు ఎత్తేస్తే.. వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేమని నిపుణులు ఇది వరకే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఎందుకంటే.. టీకాలు కేవలం వైరస్ తీవ్రతతను తగ్గించగలవని, మరణాలను నివారించగలవని, కానీ, వైరస్ సోకకుండా అడ్డుకోలేవని మారియా వ్యాన్ ఖెర్కోవ్ మరోసారి గుర్తు చేశారు. కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల్లోనూ ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు దాదాపుగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఒమిక్రాన్ బీఏ.1, బీఏ.2 సబ్ వేరియంట్ కేసులే అధికంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఎందుకంటే.. ఈ వేరియంట్ సహజంగానే వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని కలిగి ఉండటం దీనికి కారణం అని వివరించారు. గడిచిన 30 రోజుల్లో సేకరించిన స్పెసిమెన్స్‌లో అంటే.. 430,487 సీక్వెన్స్‌లలో 99.9 శాతం ఒమిక్రాన్ కేసులే అని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement