Wednesday, November 20, 2024

మొక్కజొన్న రైతు మొర వినేదెవ్వరు..?

శ్రీకాకుళం, ప్రభ న్యూస్‌ : జిల్లాలో ఈ ఏడాది ఖరీప్‌లో మొక్కజొన్న సాగుచేసే రైతు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి గత మూడు సంవత్సరాలుగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటునే ఉన్నారు. ప్రభుత్వం మొక్కజొన్న క్వాంటాళ్లకు ప్రకటించిన మద్దతుధర ఎక్కువగా ఉండడంతో జిల్లాలో గత మూడు సంవత్సరాలుగా మొక్కజొన్న పంట విస్తీర్ణం బాగా పెరిగింది. దాదాపు 30 వేల టన్నులకు పైగా జిల్లాలో మొక్కజొన్న పంట సాగుచేస్తున్నారు. అయితే ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా మొక్కజొన్న పంట కొనుగోలులో అనుసరిస్తున్న వైఖరివల్ల జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

అయితే గత సంవత్సరం నుండి ప్రభుత్వం పంట కొనుగోళ్లలో అవలంభిస్తున్న వైఖరితో జిల్లాలో మొక్కజొన్న రైతులు తీవ్ర అవస్థలుపడుతున్నారు. ప్రారంభంలో జిల్లాలో 20 వేల టన్నుల వరకూ మొక్కజొన్న పంట ఉండగా, గత సంవత్సరం ఆ మేరకు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో అధనంగా పండించిన రైతులు ఖంగుతిన్నారు. ప్రభుత్వం వారి పంటను తీసుకోకపోవడంతో వ్యాపారులకు క్వింటా రూ. 1200ల నుండి 1400ల చొప్పున అమ్మకాలు సాగించాల్సి వచ్చింది. మొక్కజొన్న నిల్వా చేసుకునే కేంద్రాలుసైతం జిల్లాలో రైతులకు అందుబాటులో లేవు. ఆయా రైతులకు పెట్టిన ఆంక్షలు కూడా రైతులకు ఇబ్బందుల పాలుచేసింది. ఎకరాకు 20 నుండి 25 టన్నుల వరకూ మొక్కజొన్న పండిస్తున్నప్పటికీ గతేడాది ప్రభుత్వం 20 టన్నులకు మాత్రమే ఎకరాకు పరిమితం చేసి మరీ కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టింది.

అఖరికి గతేడది ఖరీప్‌, రభీ రెండు సీజన్లలో కూడా మొక్కజొన్న విషయంలో రైతులు నష్టపోయారు. గత రభీలో ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యంలో రైతుల వద్ద పంట ఉన్నప్పటికీ 60 నుండి 70 శాతం మాత్రమే కొనుగోలు చేసింది. దీంతో రైతులు ఎక్కువరోజులపాటు వారి వారి ఇళ్లవద్దనే ఉంచుకోవాల్సి వచ్చింది. వర్షాలు వంటివి కురిసినప్పుడు ఎక్కువశాతం పంట భూజుపట్టి, రంగుమారడంతో రైతులు భారీగా నష్టపోయారు. మరోపక్క రైతుల నుండి ప్రభుత్వం కొనుగోలు చేసిన పంటకు చెల్లింపుల్లో కూడా తీవ్ర జాప్యం జరిగింది. గత నెల మొదటివారంలో నిర్వహించిన డిఆర్‌సిలో మొక్కజొన్న పంట విషయంపై కొందరు సభ్యులు రైతులకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రశ్నించినప్పుడు అప్పటికే రూ. 4కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని దీనిని త్వరలోనే రైతులకు అందజేస్తామని అధికారులు ప్రకటించారు.

జిల్లాలోని లావేరు, రణస్థలం, జిసిగడాం, పొందూరు తదితర మండలాల్లో మొక్కజొన్న సాగు ఎక్కువగా జరుగుతోంది. ఎక్కువశాతం మాత్రం ఈ నాలుగు మండలాల్లోనే పండించడం జరుగుతోంది. ఖరీప్‌లో మొక్కజొన్న పండించిన రైతులకు ప్రభుత్వం మద్ధతు ధర ప్రకటించినప్పటికీ ఇంతవరకూ రైతులనుండి ఒక్క గింజకూడా కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టడం లేదు. పంట కొంటామని ప్రభుత్వపరంగా కూడా అధికారులు ఎటువంట ప్రకటనా చేయకపోవడంతో పంట పండించిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అధునుగా భావిస్తున్న వ్యాపారుల, మధ్య దలారళు రైతుల నుండి పంటను తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

పంట కొనుగోలు విషయంలో ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రకటనా లేకపోవడం, మరొపక్క ఎప్పుడపడితే వర్షాలు కురుస్తుండడంతో ఆందోళన చెందుతున్న రైతులు ఏదో విధంగా తమ పంటను అమ్ముకొని సొమ్ముచేసుకుందామన్న ఆశతో వ్యాపారులకు తక్కువ ధరకు పంటను అమ్మకొంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మద్ధతు ధర ప్రకటించి కూడా ఒక్క గింజకూడా ఇప్పటి వరకూ కొనుగోలు చేయలేదని, అందువల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో తక్కువ ధరకే పంటను అమ్ముకోవాల్సిన పరిస్థిలు ఏర్పడ్డాయని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతలుకు న్యాయం చేయాలని ఆయన కోరారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement