Friday, November 22, 2024

Covid vaccine: ‘కొవాగ్జిన్‌’ టీకాకు WHO ఆమోదం

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎట్టకేలకు గుర్తింపు లభించింది. దీంతో ఈ ఘనతను సాధించిన తొలి భారతీయ కొవిడ్‌ టీకాగా కొవాగ్జిన్ రికార్డు సృష్టించింది. డబ్ల్యూహెచ్ నిర్ణయంతో ఈ టీకా తీసుకున్న భారతీయులకు విదేశీ ప్రయాణాలు సులభతరం కానున్నాయి. డబ్ల్యూహెచ్‌వో సాంకేతిక సలహా బృందం (టీఏజీ), ‘కొవాగ్జిన్‌’కు ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌ (EUL) కోసం సిఫారసు చేసింది. దీనికి అనుగుణంగా అత్యవసర గుర్తింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న 14 రోజుల తర్వాత 78 శాతం ప్రభావశీలత కనబరచినట్లు వివరించింది. దీన్ని నిల్వ చేయడం సులువు కాబట్టి మధ్య, అల్పాదాయ దేశాలకు అనువుగా ఉంటుంది పేర్కొంది. డెల్టావేరియంట్‌ పైనా కొవాగ్జిన్‌ 65.2 శాతం ప్రభావశీలత కనబడినట్టు వెల్లడైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement