తెల్లటి నెమలిని ఎప్పుడయినా చూశారా… ఉత్తర ఇటాలియన్ ద్వీపంలో శ్వేతవర్ణంలో దేవదూతలా ఉన్న ఓ నెమలి కనిపించింది. ఈ నెమలి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఉత్తర ఇటాలియన్ ద్వీపం ఐసోలా బెల్లాలోని బరోక్ గార్డెన్ వద్ద ఉన్న శిల్పం పై నుంచి అందమైన తెల్లని నెమలి ఒకటి ఎగురుతూ కనిపించింది. పొడవాటి, తెల్లటి తోకతో దేవదూతలా కనిపించింది. ఈ వీడియోను సోషల్‌మీడియాలో పెట్టగా చక్కర్లు కొడుతోంది. నెమలిని చూస్తే అచ్చం దేవకన్య భూమిపైకి దిగివస్తున్నట్లే ఉందని పలువురు కామెంట్లు చేశారు. లూసిజం అనే జన్యు పరివర్తన వల్ల ఈ నెమళ్లకు తెల్లనిరంగు వస్తుందట. ఈకల్లో వర్ణద్రవ్యం చేరకుండా లూసిజం నిరోధిస్తుంది. దీంతో అవి మన ఇండియాలో కనిపించే నెమళ్లకు విభిన్నంగా ఉంటాయి. ఇలాంటి తెల్లని నెమళ్లు భూమిపై చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయట.
Advertisement
తాజా వార్తలు
Advertisement