Saturday, November 23, 2024

తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసు ఎక్క‌డ‌…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అందరికీ ఆదర్శంగా సొంత క్యాడర్‌ ఏర్పాటు చేయాలన్న సర్కార్‌ సంకల్పం ఈ టర్మ్‌లో అమలయ్యే అవకాశం కనిపించడం లేదు. ప్రభుత్వ పథకాల అమలు, కార్యక్రమాల పర్యవేక్షణ జిల్లాల్లో సమర్ధవంతంగా, అవినీతిరహితంగా ప్రజలకు చేరేలా చూసేందుకు వినూత్న ంగా భావించిన తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసు ఏర్పాటు యోచన ఇప్పటికీ సఫలం కాలేదు. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ తొలిసారి అధికారంలోకి వచ్చిన ప్పుడు తెరపైకి తెచ్చిన ఈ అంశం వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు అనేక అవరో ధాలు ఎదురవుతున్నాయి.
ప్రస్తుతం ఒక్కో కలెక్టర్‌కు ఇద్దరు అదనపు కలెక్టర్లను(స్థానిక సంస్థలు, రెవెన్యూ వ్యవహారాలు) ఇచ్చినట్లుగానే మరో ముగ్గురు అధికారులను దశల వారీగా నియమించి పాలనను మరింత వేగవంతం చేయాలని అప్పట్లో సర్కార్‌ భావించింది. ఇందుకుగానూ ఐఏఎస్‌ తరహాలో 200 మందితో టీఏఎస్‌ ఏర్పాటు చేయాలని, నేరుగా గ్రూప్‌-1 అధికారులనే ఇందులో అవకాశం కల్పించాలని ప్రాథమికంగా నిర్ణయించి, ఈ అంశం అమలుపై అధ్యయనం కూడా చేయించారు. కనీసం ఐదేళ్ల సర్వీసు కల్గి, 45 ఏళ్లలోపు వారికే అవకాశాలు ఉండేలా చర్యలు తీసుకునేందుకు ముందుకు వచ్చింది.


జిల్లా పాలనలో విప్లవాత్మకంగా పలు బాధ్యతలను రాష్ట్రానికి చెందిన అధికారులకే అప్పగించేలా ఈ విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఇందుకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్లుగానే తెలంగాణలో కూడా సొంత అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ దిశగా కొంత కార్యాచరణ జరిపారు. నూతన రెవెన్యూ చట్టం అమలులో భాగంగా జాయింట్‌ కలెక్టర్‌ పోస్టులను రద్దుపర్చిన ప్రభుత్వం ఆ తర్వాత జిల్లాకు ఇద్దరు నాన్‌ క్యాడర్‌ అధికారులను అదనపు కలెక్టర్లుగా నియమించింది. అనంతరం కొందరు ఐఏఎస్‌లను కూడా ఈ పోస్టుల్లో నియామకం చేసింది. అప్పట్లోనే ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌(ఐఏఎస్‌)కు ధీటుగా రాష్ట్రంలోని సమర్ధులైన అధికారులతో తెలంగాణ స్టేట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (టాస్‌) ఏర్పాటు విషయంపై రాష్ట్ర ఆవిర్బా éవం తొలినాళ్లలో ఆదేశాలు జారీ చేశారు. తద్వారా రాష్ట్ర పాలనలో కీలకమైన అనుభవం ఉన్న సమర్ధులైన స్టేట్‌ క్యాడర్‌ సీనియర్‌ అధికారు లకు మూడు గ్రేడ్‌లలో గ్రూప్‌-1 స్థాయికి తగ్గకుండా అధికారులను ప్రమోట్‌ చేయాలని ప్రభుత్వం సూత్రప్రా యంగా కసరత్తు చేసింది.


తద్వారా జిల్లాల పాలనతోపాటు, కీలక శాఖలు, అదనపు కలెక్టర్లు, వైటీడీఏలు, శాఖాధిపతులుగా వీరి సేవలను వినియోగించుకోవాలని భావించింది. టాస్‌కు అనువుగా పోస్టులను గుర్తించి సమర్ధులైన సీనియర్‌ అధికారులకు పాలనలో అవకాశం కల్పించడం, దీంతో ఐఏఎస్‌ల కొరత నివారించడం వంటి సత్ఫలితాలను పొందొచ్చని తెలంగాణ ప్రభుత్వ యోచనగా ఉండగా, తద్వారా పాలన బ్యాలెన్స్‌ కావడం, సీనియర్ల సేవలతో మెరుగైన పాలన, శాఖల్లో అనుభవజ్ఞుల సేవల వినియోగంతో అనుకున్న ఫలితాల సాధనకు వీలవనుందని అంతర్గత నివేదికలు కూడా సానుకూలంగా ప్రభుత్వానికి అందాయి.
కాగా, ఈ దిశలో అనేక రాష్ట్రాలు సొంత పాలనా వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. కేరళ, ఒడిశాలలో సొంత అడ్మిని స్ట్రేటివ్‌ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు తెలంగాణ స్టేట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ ఏర్పాటు సాధ్యాసాధ్యాలకు 2015 మార్చి 10న రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్‌ నేతృత్వంలో కమిటీ వేసింది. ఈ కమిటీలో పలువురు ఉద్యోగ సంఘాల నేతలను కూడా చేర్చి వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసింది. ఈ కమిటీ నివేదిక కూడా అప్పట్లోనే ప్ర భుత్వానికి చేరింది.
తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో అధికారిక బృందం అప్పట్లో కేరళ, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌లలో పర్యటించి అక్కడి సర్వీస్‌ వివరాలను అధ్యయనం చేసింది. ఆయా రాష్ట్రాలు సొంతంగా తమ రాష్ట్రాలకు అనువైన అడ్మినిస్ట్రేటివ్‌ విధానాలను ఏర్పాటు చేసుకొని అవలంభిస్తున్నాయి. అక్కడి విధానాలు పరిశీలించిన బృందం సమర్ధ పాలనకు సొంత అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ ఉండాలని సర్కార్‌కు నివేదించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement