మనీలాండరింగ్ కేసులో ఇవ్వవాల (బుధవారం) ఈడీ విచారణకు హాజరైంది బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఆమెను ఎనిమిది గంటలపాటు విచారణ జరిపారు. కాగా, సాయంత్రం ఎనిమిది గంటల తర్వాత ఆమె ఈడీ ఆఫీసు నుంచి బయటకు వచ్చింది. మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్‌కు జాక్వెలిన్‌ను పరిచయం చేసిన పింకీ ఇరానీని కూడా ఈడీ విచారించింది. జాక్వెలిన్‌ను, పింకీ ఇరానీని ఎదురెదురుగా కూర్చోబెట్టి ఈడీ అధికారులు విచారించినట్టు సమాచారం. ఈ మేరకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉదయం11.30 గంటలకు ఢిల్లీలోని ఆర్థిక నేరాల విభాగం కార్యాలయానికి వెళ్లింది. సుకేష్‌తో ఆమెకున్న సంబంధం, అతని నుంచి లభించిన బహుమతుల గురించి ఢిల్లీ పోలీసులు సుదీర్ఘమైన ప్రశ్నల సంధిస్తున్నట్లు తెలుస్తోంది.
రూ.200 కోట్ల బెదిరింపు కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరును చార్జ్‌షీట్‌లో దాఖలు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ నమోదు చేసిన సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో జాక్వెలిన్ పేరును చేర్చారు. ఆర్థిక నేరస్థుడు సుకేశ్ చంద్ర శేఖర్ నుంచి జాక్వెలిన్ ఖరీదైన గిఫ్ట్‌లు అందుకున్నట్లు ఆరోపణలున్నాయి. మనీలాడరింగ్ కేసులో జాక్వెలిన్‌ను గతంలో కూడా ఈడీ విచారించింది. ఇప్పటికే జాక్వెలిన్‌కు చెందిన 7 కోట్ల ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది.
కాగా.. ఈడీ అటాచ్ చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్లు తన కష్టార్జితమని జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అంతకుముందు ఈడీకి తెలిపింది. రూ. 200 కోట్ల కుంభకోణంలో మనీల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేశ్ చంద్రశేఖర్ ఇచ్చిన బహుమతులు కాదని స్పష్టంచేసింది. తన సంపాదనకు సంబంధించి ఆదాయపు పన్ను కూడా చెల్లించానని, క్రైమ్ ప్రొసీడింగ్స్‌ను నిలిపి వేయాలని జాక్వెలిన్ ఈడీని కోరింది. మహా మోసగాడు సుకేశ్‌తో పరిచయం లేనప్పుడే, ఎఫ్‌డీలపై పన్ను చెల్లించినట్లు అంతకుముందు ఈడీకి ఇచ్చిన సమాధానంలో జాక్వెలిన్ తెలిపింది.