శ్రీలంక సంక్షోభం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. నిత్యావసరాల ధరలు, పండ్లు, కూరగాయలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆర్థిక, రాజకీయ సంక్షోభాల మధ్య శ్రీలంకలో పండ్లు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. శ్రీలంకలో పసిపిల్లలకు పాలు పట్టేందుకు కూడా పాలపొడి దొరకని పరిస్థితి ఏర్పడింది. కేజీ పాలపొడి రూ. 1900, కేజీ బియ్యం రూ.220, చెక్కర రూ. 240, లీటర్ కొబ్బరి నూనె రూ. 850గా ఉంది. చికెన్, కోడిగుడ్ల వీటి ధరలు కూడా చుక్కలనంటుతున్నాయి. ఇక పండ్ల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. కేజీ ఆపిల్ ధర రూ. 1000. ఇంత ధరలు పెట్టి కొందామనుకున్న ప్రజల వద్ద డబ్బుల లేవు. ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ సమీపంలో భారీగా ఆందోళన చేపట్టారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ద్రవ్యోల్బణం పెరుగుతోంది. నిత్యావసరాల ధరలు 100శాతానికి పైగా పెరిగాయి. గొటబాయ రాజపక్స అధికారం చేపట్టినప్పుడు కిలో బియ్యం 80 రూపాయలు. ప్రస్తుతం రూ.220 ఉంది. ప్రస్తుతం రోజుకు 13-14 గంటల కరెంటు కోతలున్నాయి. పరీక్షలు రాయడానికి కనీసం పేపరు కూడా లేదు. శ్రీలంకలోని ఆహార పదార్థాలను ప్రభుత్వం చైనాకు అమ్మేసింది. దేశంలో ప్రస్తుతం ఏమీ లేదని.. ఇతర దేశాల నుంచి అప్పుపై తెచ్చుకోవడమే అని మహిళా నిరసనకారురాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ధరలు ఈ విధంగా మండిపోతుండడంతో ప్రజలు తామెలా బ్రతకాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు కూడా కొనే పరిస్థితి లేదని ప్రజలంటున్నారు.