Tuesday, November 26, 2024

TS | కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: ఎమ్మెల్యే సీతక్క

ములుగు ప్రతినిధి (ప్రభ న్యూస్): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. శుక్రవారం ములుగు జిల్లా కేంద్రములో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవి చందర్ అధ్యక్షతన జరిగిన యూత్ కాంగ్రెస్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజీవ్ గాంధీ అన్ లైన్ క్విజ్ కాంపిటీషన్ లో పాల్గొనే యువతి యువకులు 7661899899 కు మిస్డ్ కాల్ ఇవ్వాలని జూన్ 1 వరకు రిజిస్ట్రేషన్ చివరి తేదీ అని చెప్పారు. ములుగు నియోజకవర్గ కోడ్ 1129 జూన్ 2 న క్విజ్ కాంపిటీషన్ లో పాల్గొని 40 బహుమతులు పొందాలని సీతక్క అన్నారు.

హైదరాబాద్ లో ప్రియాంక గాంధీ సంచలనాత్మక యూత్ డిక్లరేషన్ ను స్ఫూర్తిగా తీసుకుని నిరుద్యోగ యువకులను మెలుకొల్పే దిశగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు నడుం బిగించాలన్నారు.తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని బాధలు తీరుతాయని నమ్మిన యువతను కెసిఆర్ నట్టేట ముంచారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క నోటిఫికేషన్ ఇస్తే అది పేపర్ లికు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా లాఠీ దెబ్బలను ఓర్చుకొని పోరాటాలు కేసుల పాలైన కనీసం వారిని సీఎం కెసిఆర్ పట్టించుకున్న పాపాన పోలేదని మండిప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement