భారత్‌లో 5G నెట్‌వర్క్ మరో మూడు నెలల్లో అందుబాటులోకి వస్తుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే మౌలిక సదుపాయాల సమస్యలు 5G రాకకు అడ్డంకులుగా మారాయి. ఆప్టికల్ ఫైబర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సిద్ధం చేసుకుంటే 5 జీ అందుబాటులో రావచ్చు. లేకుంటే మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. ఒకవేళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి రాకపోయినా 5Gని ప్రారంభిస్తే కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయాల్సి ఉంటుందని టెలికాం పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనపై ఇండియా సత్వరం నిర్ణయం తీసుకోవాలని అంటున్నాయి. లేకుంటే కొత్త తరం టెక్నాలజీ ప్రయోజనాల్ని అందిపుచ్చుకోలేమని నోకియా ఇండియా తెలిపింది. ‘దేశానికి, ప్రపంచానికి ఆర్థికపరమైన ప్రయోజనాలు చేకూర్చేందుకు ప్రస్తుతం ఇది ఎంతో అవసరం. భారత్‌లో 5జీ తయారు చేస్తున్నాం. హార్డ్‌వేర్ సిద్ధంగా ఉంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే మూడు నెలల్లోనే భారత్‌లో 5జీ నెట్‌వర్క్‌లను వినియోగంలోకి తేవడం మొదలుపెట్టవచ్చు’ అని నోకియా ఇండియా హెడ్ అమిత్ మార్వా తెలిపారు. కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయడమనేది ఇండియాలో వ్యయ, ప్రయాసలతో కూడుకున్న వ్యవహారమని టెలికాం ఎక్స్‌పోర్ట్ ప్రమోషనల్ కౌన్సిల్ భావిస్తోంది. రుణాలపై వడ్డీ రేటు ఎక్కువగా ఉండటమే కారణమని అంటున్నాయి. మరోవైపు చైనాలో కొత్త టెక్నాలజీ అభివృద్ధికి స్థానిక కంపెనీలకు 2 వందల బిలియన్ డాలర్ల వరకూ ప్రభుత్వమే సమకూరుస్తోందనే సంగతిని గుర్తు చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement