వాట్సాప్ యూజర్లకు మెటా గుడ్‌న్యూస్ చెప్పింది. తన చాట్ యాప్‌లో ఎమోజీ రియాక్షన్లను మరిన్ని యాడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా ఒకే గ్రూప్ వాయిస్ కాల్‌లో గరిష్ఠంగా 32 మంది వ్యక్తులను చేర్చుకునేందుకు అవకాశం కల్పించినట్టు తెలిపింది. దీంతోపాటు ప్రస్తుత షేరింగ్ పరిమాణం 100 ఎంపీ నుంచి 2జీబీ వరకు ఫైల్‌లకు సపోర్ట్ ఇచ్చేలే ఫైల్ షేరింగ్‌ను ఫెసిలిటీని పెంచుతున్నట్టు ప్రకటించింది.
WhatsApp ముందుగా ఆరు కీలక ఎమోజీలతో రిప్లయ్ ఇవ్వడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అయితే మరింత ఈజీగా ఉండేలా వీటిని యాడ్ చేసుకునేలా చాన్స్ కల్పిస్తోంది. తద్వారా ప్రజలు కొత్త సందేశాలతో చాట్‌లను నింపకుండా వారి అభిప్రాయాన్ని త్వరగా పంచుకునే వెసులుబాటు ఉంటుంది. “వాట్సాప్‌కు ప్రతిస్పందనలు వస్తున్నాయని.. అన్ని ఎమోజీలు, స్కిన్ టోన్‌లు రానున్నాయని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము” అని వాట్సాప్ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ ఒక ట్వీట్‌లో తెలిపారు. కంపెనీ 2 గిగాబైట్‌ల వరకు ఫైల్‌లకు మద్దతు ఇవ్వడానికి ఫైల్ షేరింగ్‌ను కూడా పెంచింది, తద్వారా వ్యక్తులు ప్రాజెక్ట్ లలో సులభంగా సహకరించవచ్చు. చాట్ చేయడం కంటే ప్రత్యక్షంగా మాట్లాడటం ఉత్తమం అయితే ఆ సమయాల్లో సరికొత్త డిజైన్‌తో 32 మంది వ్యక్తుల కోసం వన్-ట్యాప్ వాయిస్ కాలింగ్‌ను పరిచయం చేస్తాము” అని WhatsApp తెలిపింది. ప్రస్తుతం, ఇది గ్రూప్ వాయిస్ కాల్‌లో 8 మందిని మాత్రమే అనుమతిస్తుంది. గ్రూప్ అడ్మిన్‌లు ప్రతి ఒక్కరి చాట్‌ల నుండి తప్పు లేదా సమస్యాత్మక సందేశాలను కూడా తీసివేయగలరు. మున్ముందు దీన్ని మరింత బెటర్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నామని అవన్నీ టెస్ట్ వర్షన్లో ఉన్నాయని మెటా ప్రతినిధులు తెలిపారు.