– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
వాట్సాప్ iOS వినియోగదారుల కోసం కంపానియన్ మోడ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. స్మార్ట్ ఫోన్‌తో సహా నాలుగు అదనపు పరికరాలకు (కంప్యూటర్, ల్యాప్‌టాప్, ట్యాబ్, మరో స్మార్ట్‌ఫోన్) లింక్ చేసుకునేందుకు ఇది మరింత ఈజీ కానుంది. కంపానియన్ మోడ్ ఫీచర్ వినియోగదారులు వారి ప్రాథమిక స్మార్ట్ ఫోన్‌లో.. అలాగే వారి లింక్ చేయబడిన ఇతర పరికరాలలో మెస్సేజులను చూడ్డానికి ఉపయోగపడుతంది. ఇంతకుముందు అయితే ఒక్క Android ఫోన్లలోని WhatsApp బీటా యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉండేది. ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్‌లో భాగంగా iOS వినియోగదారుల కోసం కంపానియన్ మోడ్‌ని వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
iOSలో కంపానియన్ మోడ్ కి సంబంధించిన రోల్‌అవుట్‌ను మొదటగా WhatsApp డెవలప్‌మెంట్‌ని నిశితంగా పరిశీలించే ఫీచర్ ట్రాకర్ అయిన WABetaInfo లో వెల్లడించారు.. iOS 23.10.76 వర్షలో WhatsApp తెలియపరిచిన ఈ అప్‌డేట్ Apple App Store ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ సరికొత్త ఫీచర్ ఎంతో మెరుగైన పనితీరును అందజేస్తుందని కంపెనీ తెలియజేసింది. వినియోగదారులు వారి iPhoneలను ప్రైమరీ స్మార్ట్ ఫోన్‌తో లింక్ చేయడానికి ఈ ఫీచర్ అనుకూలంగా ఉంటుంది.
ఇక.. iOS 23.10.76 వర్షన్ అప్‌డేట్ చేసుకోవడం ద్వారా WhatsAppలో కంపానియన్ మోడ్ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానుంది. యూజర్లు తమ WhatsApp అకౌంట్ నుంచి iPhoneలను లింక్డ్ డివైజ్‌లుగా ఇతర ఫోన్లను, కంప్యూటర్ లేదా లాప్టాప్ని సెటప్ చేయవచ్చు. కాగా, WhatsApp యొక్క కంపానియన్ మోడ్ కి సంబంధించిన ముఖ్యమైన ప్రయోజనాల్లో క్రాస్-ప్లాట్‌ఫారమ్ సపోర్ట్ ఉంటుంది. దీని ఉపయోగం ఏంటంటే వినియోగదారులు తమ ఐఫోన్‌ను.. ఆండ్రాయిడ్‌లో వాట్సాప్ అకౌంట్స్ ఉన్నవారు కూడా లింక్ చేయవచ్చు. దీనికి విరుద్ధంగా.. సెకండరీ ఫోన్‌లో WhatsApp అకౌంట్ యాక్సెస్ పరిమితం అయినప్పటికీ, వినియోగదారులు ఇప్పటికీ ఏదైనా లింక్ చేసిన ఫోన్‌లో చాట్‌లు, ఆర్కైవ్ చేసిన చాట్‌లను యాక్సెస్ చేయడానికి చాన్స్ ఉంటుంది.
వాట్సాప్ కి చెందిన తాజా వెర్షన్‌తో ఐఫోన్‌ను మరొక స్మార్ట్ ఫోన్‌కు లింక్ చేయడానికి, యూజర్లు ఈ విధంగా ఫాలో కావచ్చు:
• iOS 23.10.76 కోసం WhatsAppను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత లేదా అప్‌డేట్ చేసిన తర్వాత iPhoneలో WhatsAppని ఓపెన్ చేయండి.
• ఇప్పటికే ఉన్న అకౌంట్‌కి ‘లింక్ చేయండి’.. అనే దగ్గర ప్రెస్ చేయండి. ఆ తర్వాత QR కోడ్ కనిపించే వరకు వేచి ఉండాలి.
• ప్రాథమిక స్మార్ట్ ఫోన్‌లో WhatsApp ఓపెన్ చేసి, సెట్టింగ్స్ (iOS) లేదా ఆండ్రాయిడ్ అయితే త్రీ-డాట్ మెను ఐకాన్ (Android)పై ప్రెస్ చేయాలి. ఆపై “లింక్డ్ డివైజ్” ఎంచుకోవాలి.
• “QR కోడ్‌తో లింక్ చేయండి” ఎంపికను ఎంచుకోవాలి.
• లింక్ చేసే ప్రక్రియను పూర్తి చేయడానికి ఇతర స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించి iPhoneలో కనిపించే QR కోడ్‌ని స్కాన్ చేయాలి.
కొత్త ఫీచర్‌తో వినియోగదారులు తమ వాట్సాప్ కాంటాక్ట్ లతో కనెక్ట్ గా ఉంటూనే.. ఐఫోన్, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ల మధ్య ఈజీగా షిఫ్ట్ కావచ్చు.