మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్.. ఆపిల్ ఫోన్లు వాడే iOS యూజర్లకి లేటెస్ట్ అప్డేట్ని తీసుకొచ్చింది. ఈ అప్డేట్లో పర్సనలైజ్డ్ అవతార్లను సృష్టించి.. వాటిని స్టిక్కర్లు, ప్రొఫైల్ పిక్చర్లుగా ఉపయోగించుకునే అవకాశం అందుబాటులోకి తెచ్చింది. ఇక.. కొంతమంది వాట్సాప్ యూజర్లు అయితే.. ఇప్పటికే ఇట్లాంటి అప్డేట్ని పొందారు. WABetaInfo తెలిపిన వివరాల ప్రకారం.. ఇది ఇప్పుడు మరింత మందికి అందుబాటులోకి వచ్చినట్టు స్పష్టమవుతోంది. యూజర్లు తమ అకౌంట్లో ఇట్లాంటి ఫీచర్ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి WhatsApp సెట్టింగ్‌ని ఓపెన్ చేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
అంతేకాకుండా.. ఈ లేటెస్ట్ అప్డేట్లో మరో కొత్త ఫీచర్‌ని కూడా యూజర్లు పొందవచ్చు. వాట్సాప్ కెమెరాని ఎడమవైపుకు స్వైప్ చేయడం ద్వారా వీడియోలను హ్యాండ్స్-ఫ్రీగా రికార్డ్ చేసే ఫీచర్‌ని కూడా ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ తీసుకొచ్చింది. అంతేకాకుండా తాజా అప్డేట్లో కొన్ని సెకన్ల పాటు “డిలీట్ ఫర్ మీ” అనే ఆప్షన్ని కూడా చూడొచ్చు.
అయితే.. ఇప్పటికీ ఈ ఫీచర్ అప్డేట్ కాని వారు ముందు ముందు అప్డేట్స్ అందుకునే అవకాశం ఉందని వాట్సాప్ వెల్లడించింది. WhatsApp చాట్లు, గ్రూప్స్‌లో మెస్సేజ్‌లను పిన్ చేయడానికి కూడా కొత్త ఫీచర్ వచ్చినట్టు తెలుస్తోంది. యూజర్లు ముఖ్యమైన మెస్సేజ్‌లను చాట్‌లో పైభాగానికి పిన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం వల్ల ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుందని WABetaInfo తెలిపింది.