ఇన్‌స్టంట్ మెసేజింగ్ సంస్థ వాట్సాప్ సెప్టెంబరులో దేశంలోని 26.85 లక్షల ఖాతాలను బ్లాక్ చేసింది. ఆగస్టులో నిషేధించిన 23.28 లక్షల ఖాతాల కంటే సెప్టెంబర్‌లో బ్లాక్ చేసిన అకౌంట్ల సంఖ్య 15 శాతం ఎక్కువగా ఉంది. గత సంవత్సరం అమల్లోకి వచ్చిన కఠినమైన IT నియమాలు, పెద్ద డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు (50 లక్షలకు పైగా వినియోగదారులతో) ప్రతి నెలా నివేదికలను ప్రచురించాలని, అందిన ఫిర్యాదుల వివరాలను, తీసుకున్న చర్యలను పేర్కొనాలని వాట్సాప్ సంస్థ తెలిపింది.
సోషల్ మీడియా సంస్థలు తమ ప్లాట్‌ఫారమ్‌లలో విద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు సమాచారం.. నకిలీ వార్తలను షేర్ చేస్తుండడపై గతంలోనే వాట్సాప్ సీరియస్ అయ్యింది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఏకపక్షంగా కంటెంట్‌ని పుష్ చేయడం.. వినియోగదారులను ‘డి-ప్లాట్‌ఫార్మింగ్’ చేయడంపై కొన్ని ఆందోళనలు నెలకొన్నాయి. పెద్ద టెక్ కంపెనీల ఏకపక్ష కంటెంట్ నియంత్రణ, నిష్క్రియాత్మకత లేదా ఉపసంహరణ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఫిర్యాదుల అప్పీల్ మెకానిజమ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం గత వారం నిబంధనలను ప్రకటించింది. తాజా వాట్సాప్ నివేదిక ప్రకారం.. ప్లాట్‌ఫారమ్‌కు సెప్టెంబర్‌లో 666 ఫిర్యాదులు అందాయి. అయితే వీటిలో 23 మందిపై మాత్రమే చర్యలు తీసుకున్నట్టు వాట్సాప్ సంస్థ ప్రకటించింది.