Saturday, November 23, 2024

ఉత్తమ్ డైరెక్షన్‌లో కౌశిక్.. పీసీసీలో ఏం జరుగుతోంది?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తాజా మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో ముప్పు ఉందా? ఆయన పార్టీ మారుతున్నారా? లేక తన వర్గం వారిని నెమ్మదిగా అధికార టీఆర్ఎస్ పార్టీలో చేర్చేందుకు ప్లాన్ చేస్తున్నారా? అన్న ప్రశ్నలు  ఉత్పన్నమవుతున్నాయి.

గత అనుభవాలు చూస్తే మాజీ పీసీసీ అధ్యక్షులుగా పని చేసిన వారిలో కొందరు కాంగ్రెస్ పార్టీకి గుడ్ చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ కు పీసీసీ చీఫ్ లు గా పని చేసిన కే కేశవరావు, డి శ్రీనివాస్ లు ఆ తర్వాత కాలంలో టీఆర్ఎస్ లో చేరారు. ఆ క్రమంలో ఇప్పుడు మరో మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కూడా కారులో ప్రయాణిస్తారా? అన్న సందేహాం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ఆడియో వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయిన నేపథ్యంలో ఉత్తమ్ కాంగ్రెస్ లో ఉంటాడా? లేక కారెక్కుతాడా? అన్న డౌట్ టీ కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

హుజురాబాద్ టీఆర్ఎస్ టికెట్ తనకే అంటూ ఉత్తమ్ తమ్ముడు కౌశిక్ రెడ్డి ఆడియాపై సర్వత్ర చర్చ జరుగుతోంది. కొద్ది రోజులు క్రితం మంత్రి కేటీఆర్ తో కౌశిక్ రెడ్డి భేటీ అయినప్పుడే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడుతారని ప్రచారం జరిగింది. అయితే, ఈ అంశంపై ఉత్తమ్ మాట్లాడకపోవడం చర్చనీయాంశమైంది. కౌశిక్ ఉత్తమ్ మాట జవదాటడు అని వాదన ఉంది. అంతేకాదు ఉత్తమ్ డైరెక్షన్ లేకుండా ఆయన ఏమీ చేయడని పేరుంది. ఈ నేపథ్యంలో కౌశిక్ టీఆర్ఎస్ లో చేరడంతో తర్వాత ఉత్తమ్ కూడా ఆ బాటే పడతారా ? అన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పీసీసీ క్రమశిక్షణ సంఘం కౌశిక్ రెడ్డికి షోకాజ్ నోటిసులు జారీ చేసింది. ఆయనపై వేటే వేసే అవకాశం ఉంది.

నిజానికి ఉత్తమ్ తనికి తాను కాంగ్రెస్ లాయలిస్ట్ గా చెప్పుకుంటారు. సోనియా, రాహుల్ కు బాగా దగ్గరవాడు అన్న టాక్ కూడా ఉంది. కానీ, ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఉత్తమ్ హయాంలో కాంగ్రెస్ పార్టీ వరుసగా ఓటములు చవిచూసింది. ఉత్తమ్ సహా పార్టీలోని కొందరు టీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్ గా వ్యవహరిస్తున్నారని గతంలో కొందరు సీనియర్ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. సొంత పార్టీకి సంబంధించిన అంశాలను టీఆర్ఎస్ కు లీకులు ఇచ్చి.. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారని ఆరోపణలు వినిపించాయి. తాజాగా కౌశిక్ రెడ్డి వ్యవహారంతో ఇప్పుడు అందరి చూపు ఉత్తమ్ పైనే ఉన్నాయి.

ఇది కూడా చదవండి: కౌశిక్ రెడ్డికి టిఆర్ఎస్ టికెట్.. మరి కాంగ్రెస్ సంగతేంటి?

Advertisement

తాజా వార్తలు

Advertisement