Friday, November 22, 2024

Spl Story: వాట్​ నెక్ట్స్​, రాష్ట్రపతి అయ్యేది ఎవరు?.. ఎవరికి ఎక్కువ చాన్సెస్​ ఉన్నాయంటే!

దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించి చిటపట చినుకులతో వాతావరణాన్ని​ కూల్​ చేశాయి. సామాన్య జనం, రైతులు వ్యవసాయ పనుల్లో నిగ్నమయ్యారు. కానీ, ఇట్లాంటి కూల్​ సిచ్యుయేషన్​లో కూడా దేశ రాజకీయాల్లో రాష్ట్రపతి ఎన్నికలు హీట్​ పెంచేశాయి. అధికార, విపక్ష పార్టీల వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజీపీ వ్యూహాత్మంగా ఒడిశాకు చెందిన ఆదివాసి మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించగా.. పలు కీలక పరిణామాల నడుమ సుదీర్ఘ అనుభవం ఉన్న యశ్వంత్ సిన్హాను ఉమ్మడి అభ్యర్థిగా విపక్షాలు బరిలోకి దింపాయి. ఇప్పటికే ఇరు పక్షాల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసి, ప్రచారాన్ని కూడా ప్రారంభించారు..

‌‌- డిజిటల్​ మీడియా విభాగం, ఆంధ్రప్రభ

- Advertisement -

ఇక.. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల తీరు మరింత ఉత్కంఠగా మారనుంది. ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరు గెలుస్తారనేదానిపై అనేక విశ్లేషణలు జరుగుతున్నాయి. తమ గెలుపపై ఇరు పక్షాలు ఎంతో ధీమాగా ఉన్నాయి. సోమవారం యశ్వంత్ సిన్హా నామినేషన్​ సందర్భంగా కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాల కూటమిని ‘ఇంద్ర ధనుస్సు’ కూటమిగా అభివర్ణించారు. వివిధ భావజాలాలు, లక్ష్యాలతో కూడిన పార్టీలు ఒకే వేదికపైకి వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ‘ఇంద్ర ధనుస్సు’ కూటమి ఎలాంటి ఫలితాలను సాధిస్తుంది? ఇంతకీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? ఇరు పక్షాల బలాబలాలు, వ్యూహాలు ఏంటో ఓ సారి పరిశీలిద్దాం!

  1. 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో దళిత కార్డు వాడిన బీజీపీ ఈసారి చరిత్రలో ఫస్ట్​ టైమ్​ సంతాల్​ తెగకు చెందిన ఆదివాసి మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి​ అభ్యర్థిగా ప్రకటించింది. అభ్యర్థి ప్రకటనతో బీజేపీ సగం విజయం సాధించినట్టు భావిస్తోంది..
  2. బీజేపీతో పాటు ఆ పార్టీ కూటమి పాలనలో 18 రాష్ట్రాలున్నాయి. దేశంలో మరే పార్టీకి ఈ స్థాయిలో బలం లేదు.
  3. ఆదివాసి మహిళ ముర్మును తెరపైకి తేవడం వల్ల కాంగ్రెస్​ కూటమిలోని కొన్ని పార్టీలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేసే అనివార్య పరిస్థితిని తీసుకొచ్చింది బీజేపీ.
  4. ఝార్ఖండ్​ సీఎం హేమంత్ సోరెన్​కు.. ఆ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసిన ద్రౌపది ముర్ముతో మంచి సంబంధాలున్నాయి. సోరెన్​ కూడా సంతాల్​ తెగకు చెందిన వారు కావడం గమనార్హం. హేమంత్ సోరెన్ గతంలో ఆదివాసి రాష్ట్రపతి కావాలని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే ముర్ముకు సోరెన్​ మద్దతు ప్రకటించే చాన్సెస్​ ఉన్నాయి. అంతేకాకుండా బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ముర్ముకే మద్దతు తెలిపారు.
  5. ఎన్డీఏకు పార్లమెంట్​లో మెజార్టీ బాగానే ఉంది. కానీ అసెంబ్లీలో లేదు. ఈ నేపథ్యంలో ముర్ము గెలవాలంటే.. ఏపీలోని వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ, ఒడిశాలోని బిజూ జనతాదళ్​ (బీజేడీ), తెలంగాణలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్​ ఎస్​) ​ ఓట్లు చాలా కీలకం.
  6. ఇక.. ద్రౌపది ముర్ము ఒడిశాకు చెందిన ఆదివాసి మహిళ కావడంతో తమ మద్దతు ఆమెకే ఆని ప్రకటించారు ఒడిశా సీఎం, బీజేడీ అధినేత నవీన్​ పట్నాయక్​.
  7. ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్​ కూడా ముర్ముకే జై కొట్టారు. దీంతో ఎన్డీఏ అభ్యర్థి గెలుపు ఈజీనే అనే సంకేతాలు వస్తున్నాయి.
  8. అంతేకాకుండా ప్రతిపక్షాలు ఐక్యంగా లేకపోడవం వల్ల కూడా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది..
  9. కలిసి కట్టుగా అన్ని పార్టీలు ఒక్క తాటి పైకి వస్తేనే.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థికి యశ్వంత్​ సిన్హా గెలుస్తారు. అయితే.. ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. ఇప్పటికే.. వైకాపా, బీజేడీ, బీఎస్పీ ద్రౌపతి ముర్ముకు మద్దతు తెలిపాయి.
  10. ఇక ఇప్పుడు వ్యూహాలు రచించి, అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించగల శరద్ ​పవార్​.. ప్రస్తుతం మహారాష్ట్ర సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోవడం కూడా మరో మైనస్​గా చెప్పుకోవచ్చు.

ఇక.. కాంగ్రెస్​ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ వంటి అగ్ర నేతలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ చిక్కుల్లో ఇరికించింది. ఇప్పటికే రాహుల్​ గాంధీ విచారణలో భాగంగా పలుమార్లు ఈడీ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. ఈ పరిణామం కూడా రాష్ట్రపతి ఎన్నికల విషయంలో పూర్తిగా భాగస్వాములయ్యే చాన్స్​ లేకుండా  దెబ్బతీసిందనే చెప్పవచ్చు. ఇట్లా విపక్షాలను ఏకతాటిపైకి రాకుండా.. కూటమి మెంబర్స్​ అందరినీ గందరగోళంలో పడేసి.. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలని బీజేపీ ప్లాన్​ చేసినట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటున్నారు పొలిటికల్​ అనలిస్టులు. ఈ పరిణామాలన్ని ముర్ము విజయానికి దోహదపడేలా ఉన్నాయి.

ద్రౌపది ముర్ము ఎంపికతో ఆదివాసి సానుభూతి బీజేపీ లభించే అకాశాలు ఎక్కువుననాయి. ఈ ఏడాది గుజరాత్‌, వచ్చే ఏడాది మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్‌లో 15శాతం, మధ్యప్రదేశ్‌లో 21శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 30శాతం, రాజస్థాన్‌లో 13.5శాతం ఆదివాసీలున్నారు. ఇన్నాళ్లు బీజేపీకి దూరంగా ఉన్న ఆదివాసి తెగ.. ఈ నిర్ణయంతో వారికి దగ్గరయ్యే చాన్సెస్​ కూడా ఉన్నాయంటున్నారు పరిశీలకులు.

ఇక.. విపక్షాలు అన్నీ ఏకగ్రీవంగా.. ఒకే అంశంపై నిలబడి ఉంటే.. ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించడం ద్వారా వారి ఐక్యతను చాటుకునే వారని, తద్వారా అధికార బీజేపీని నిలువరించే చాన్సెస్​ ఉండేవని కూడా చెబుతున్నారు. విపక్ష కూటమిలో ఎక్కువగా ప్రాంతీయ పార్టీలే కావడం, అందులో అవి ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉండడం కూడా వారు నిలబెట్టిన అభ్యర్థికి కలిసి వచ్చేదన్న భావనలు వినిపిస్తున్నాయి.

అయితే.. యశ్వంత్​ సిన్హాకు అన్ని పార్టీలతో మంచి రిలేషన్స్​ ఉన్నాయి. గతంలో బీజేపీలో అగ్రస్థాయి నాయకుడిగా ఉన్నారు. ఎవరికీ చెడు చేసిన, తప్పుడు వ్యాఖ్యలు చేసిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఆయన మీద ఉన్న సానుభూతి, అభిమానంతో కూడా అధికార పక్షంలోని కొంతమంది సభ్యులు యశ్వంత్​ సిన్హా కోసం ఓటు వేయవచ్చన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా మాజీ ప్రధాని వాజ్​పేయీలో ఉన్న ప్రజాస్వామిక దృక్పథం ఇప్పుడున్న ప్రధాని మోదీలో లేదని యశ్వంత్​ సిన్హా బహిరంగంగానే విమర్శలు చేశారు. వాజ్‌పేయీకి సిన్హా దగ్గరగా ఉండేవారు. ఫలితంగా ఓటింగ్​ సమయంలో బీజేపీలో ఉన్న వాజ్‌పేయీ అభిమానులు​, మోదీ వ్యతిరేక వర్గంలోని వారు యశ్వంత్ సిన్హాకు అనుకూలంగా మారే చాన్సెస్​ కూడా ఉంటాయని, దేన్నీ తక్కువగా అంచనా వేయలేమని అంటున్నారు అనలిస్టులు.

గత రాష్ట్రపతి ఎన్నికల కంటే ఈసారి ఎన్డీఏకి ఎంపీలు పెరిగినా.. ఎమ్మెల్యేల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ మధ్య కాలంలో జరిగిన యూపీ ఏన్నికల్లోనే సుమారు 80మంది ఎమ్మెల్యేలు తగ్గారు. రాంనాథ్​ కోవింద్​ సమయంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. అప్పట్లో బీజేపీ అభ్యర్థికి మద్దతిచ్చిన కొన్ని పార్టీలు ఇప్పుడు దూరం అయ్యాయి. అందులో టీఆర్​ఎస్​​, శివసేన, టీడీపీ వంటి పార్టీలు 2017లో కోవింద్​కు అనుకూలంగా ఓటు వేశాయి.. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. టీఆర్​ఎస్​, శివసేన వంటివి విపక్షాల కూటమిలో కీలకంగా మారాయి. దీంతో ఇట్లాంటివన్నీ కూడా యశ్వంత్​ సిన్హాకు కలిసి వస్తాయని విపక్షపార్టీల నేతలు అంటున్నారు.

ఇక.. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమైన జేడీయూ.. విపక్షాలు కూటమి వైపు మొగ్గినా ఆశ్చర్యపోనసరం లేదని కూడా కొంతమంది చెబుతున్నారు. ఎన్డీఏలో ఉంటూనే.. యూపీఏకు ఓటేసిన అనుభవం జేడీయూకు ఉంది. ఈసారి కూడా అలా జరిగే చాన్స్​ లేకపోలేదని అంటున్నారు పరిశీలకలుఉ. యశ్వంత్ సిన్హాకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. బిహార్ పట్నాకు చెందిన సిన్హా.. 24 ఏళ్ల పాటు ఐఏఎస్​గా సేవలందించారు. లోక్​సభ, రాజ్యసభకు పలుమార్లు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కాగా, ఎన్నికల షెడ్యూల్​ ప్రకారం.. జులై 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ పదవీకాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో జులై 18న కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం ఓటింగ్ జరగనుంది. 21న కౌంటింగ్​ నిర్వహిస్తారు. జులై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement