దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి మీ స్పందన ఏంటీ అని ప్రశ్నించాడు ఓ నెటిజన్ యాంకర్ శ్యామలని. దానికి ఆమె స్పందిస్తూ నో కామెంట్స్,… కానీ ఆయన గొప్ప దర్శకుడు. ఒకప్పుడు వర్మ సినిమాలకు పెద్ద అభిమానిని అంటూ సమాధానం ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. వీరి ఇద్దరి మధ్య గతంలో రొమాంటిక్ మ్యాటర్లు జరిగి ఉంటాయని కొంత మంది కామెంట్లు పెట్టేస్తున్నారు. మొత్తానికి శ్యామల కామెంట్ వైరల్ గా మారింది. టాలీవుడ్ దర్శకుడు రాం గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సంచనాలు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఆర్జీవీ. ఎప్పుడు ఏదో ఒక అంశంపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ.. రచ్చ చేస్తూ ఉంటారు వర్మ. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినీతారలనే టార్గెట్ చేస్తూ… కౌంటర్లు పేల్చుతుంటారు. రాజకీయ నేతల బయోగ్రఫీ లపై సినిమాలు తీస్తూ ఉంటారు వర్మ. అలాంటి రామ్ గోపాల్ వర్మ పైనే టాలీవుడ్ యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement