ఊరంతా శోభ.. ఆకట్టుకునే రంగవల్లులు.. ఆకర్షించే గొబ్బెమ్మలు.. అనేక ప్రత్యేకతల నిలయం సంక్రాంతి. ఏ ఇంట చూసినా పండుగ వాతావరణం ఉట్టిపడే వేళ.. కొత్త అల్లుళ్ల రాకతో .. బావలను ఆటపట్టించే మరదల్ల సరదాలతో… ఆధ్యంతం సంతోషాలు వెల్లివిరిసే పండుగ ఇది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే కుటుంబాల ఆత్మీయ కలయికకు వేదిక ఈ పండుగ. బోసినవ్వుల తాతల, బామ్మల కబుర్లు మరింత ప్రత్యేకం..
ముగ్గులు..
రాళ్లు, రప్పలూ లేకుండా ఒక పద్ధతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. ఒక పద్ధతిలో పెట్టబడు చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం. చుక్కలచుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళలో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పడికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్యు స్థానానికి సంకేతం. ఇంకొక దృక్పథంలో గీతలు స్థితశక్తికి (స్టాటిక్ ఫోర్స్),చుక్కలు గతిశక్తి (డైనమిక్ ఫోర్స్)కు సంకేతాలని, ముగ్గులు శ్రీ చక్ర సమర్పనా ప్రతీకలని శక్తి త్వత్తవేత్తలు అంటారు.. ఇక వివిధ ఆకారాలతో వేసే ముగ్గులు విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికీ, పుష్పం పుష్యమీ నక్షత్రానికీ పాము ఆకారం ఆశ్లేషకూ, మేక, ఎద్దు, పీత, సింహం, ఇలాంటివి మేష, వృషభ, మిధున, కర్కాటక రాసులకూ, తొమ్మిది గడుల ముగ్గు నవగ్రహాలుకూ సంకేతాలుగా చెబుతుంటారు.
గొబ్బెమ్మలు..
పెద్ద వయసు మహిళలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు సంకేతం. ఈ ముద్దల తలమీద కనుపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ పుణ్య మహిళలకు సంకేతం. ఆ గోపికా మహిళల రూపాలకు సంకేతమే గోపీ, బొమ్మలు. గొబ్బెమ్మలు. మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్థిస్తుంటారు. దీనిని సందే గొబ్బెమ్మ అంటారు. గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి, దానిపై గుమ్మడి పూలుతో అలంకారం చేస్తే చాలా అందంగా ఉంటుంది.
భోగిమంటలు..
మూడురోజులపాటు- సాగే సంక్రాంతి పండుగలో మొదటి రోజున నాలుగు మార్గాల కూడలిలో వేయబడే పెద్ద మంట. అప్పటి నుండి ఇంతకంటే మరింత వేడితో ఉత్తరాయణ సూర్యుడు రాబోతున్నడనే సంకేతం. దక్షణాయంలో ఉండే నిద్ర బద్దకంతో సహా దగ్ధం చేయాలనే సంకేతంతో చీకటితోనే బోగిమంట వేస్తారు. ఇంట్లో ఉండే పాత కలపసామానులు, వస్తువులు, ఎండుకొమ్మలు లాంటివి బోగి మంటలో వేసి తగులబెడుతారు. వీటన్నిటినీ దారిద్య్ర చిహ్నాలుగా బావించి తగులబెట్టాలంటారు. వేసవిలో వేడికి తగులబడే వాటిని గుర్తించాలనే మరొక సంకేతం కూడా ఇందులో ఇమిడి ఉంది.
భోగిపళ్ళు..
భోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో భోగిపండ్లు పోస్తారు.
తిల తర్పణం..
సంవత్సరంలో మిగిలిన రోజులలో నల్ల నువ్వులు వాడరు. కాని సంక్రాంతి పర్వదినాన మాత్రం నల్లనువ్వులతో మరణించిన పిత్రుదేవతలందరికీ తర్పణములివ్వడం చేస్తుంటారు. దీన్నే పెద్దలకు పెట్టు-కోవడం అంటుంటారు. సంక్రాంతి పర్వదినాల్లో వారి వారి ఆచార సంప్రదాయాలను అనుసరించి దీన్ని చేస్తుంటారు. ఈ రోజు బూడిద గుమ్మడి కాయ దానం చేస్తే మంచిదని నమ్మకం.
హరిదాసు..
గొబ్బిళ్లతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్ శ్రీకృస్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని నమ్మకం. ఆయన తలమీద మంచి గుమ్మడి కాయ ఆకారంలో ఉండే ఓ పాత్ర గుండ్రముగా ఉండే భూమికి సంకేతం దాన్ని తలమీద పెట్టు-కొని ఉండటం శ్రీ హరి అయిన తానే భూమిని ఉద్దరిస్తున్నానని అని చెప్పే దానికి సంకేతం. హరినామ కీర్తన చేస్తూ రావడం తను ఏ భోగాలకూ లొంగనని, కేవలం హరినామ సంకీర్తనకే వచ్చే వాడిననీ తనకు తమపర భేదాలు లేవనీ అందుకే ప్రతి ఇంటికీ తిరుగుతూ వస్తాడనే సంకేతం.
గంగిరెద్దు..
ముందు వెనుకల చెరో ప్రమదునితో (శివ గణం) ఎత్తైన మూపురం శివలింగాకృతిని గుర్తుచేస్తూ శివునితో సహా తను సంక్రాంతి సంబరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతం గంగిరెద్దు. ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు ముగ్గులో నిలిచిందంటే ఆనేల ధర్మబద్ధమైనదని అర్థం. ఆ నేల ఆవుకి సంకేతం , ఆనేల నుండి వచ్చిన పంటకు సంకేతం ముంగిట నిలిచిన వృషభం. మీరు చేసే దానమంతా ధర్మబద్ధమేనంటూ దాన్ని తాము ఆమోదిస్తున్నామని ఇంటింటికీ తిరుగుతుంటారు వృషభసహిత శంకర పరివారం.
గాలిపటాలు..
సంక్రాంతి పండుగ పిల్లలందరికి చాలా ప్రథ్యెకమైన పండుగ, పిల్లలు అరొజు పొద్దిన నుండి సాయంత్రం వరకు గాలిపటాలు ఎగురవేస్తూ గడుపుతారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..