బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభలో విచిత్ర పరిస్థితి కనిపించింది. సభనుద్దేశించి మాట్లాడిన చాలామంది లీడర్లు తెలంగాణలో అభివృద్ధి జరగడం లేదని, పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ రావడం లేదని, ఫ్యాక్టరీలు రావడం లేదని విమర్శలు చేశారు. అంతేకాకుండా కేవలం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను తిట్టుడే వారి పనిగా పెట్టుకుని ప్రసంగించారు. ఇంతగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించింది ఓన్లీ కేసీఆర్, కేటీఆర్‌ను తిట్టడానికే నిర్వహించారా? అన్న వాదన చాలామంది నుంచి వినిపిస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
బీజేపీ తన జాతీయ విధానం ఏంటో తెలియజేయాలి.. ఇప్పుడు జరిగిన తెలంగాణ అభివృద్ధి కంటే తాము మరింత బెటర్‌గా చేస్తున్నామని, వారి పథకాలను ఉదాహరణగా చూపాలి. అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో మంచి పథకాలను ఉదహరిస్తూ అంత గొప్పగా తెలంగాణలోనూ పరిపాలన చేస్తామని, ప్రజల బాధలు తొలిగిస్తామని ఉదాహరణలతో చెప్పాలి. కానీ, కేవలం కుటుంబ పాలన, కల్వకుంట్ల కుటుంబ అనే రెండు అంశాలనే బేస్ చేసుకుని యావత్ బీజేపీ సభ జరగడం బాధాకరమని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు.