ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సెర్చ్ ఇంజిన్ గూగుల్. ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో గూగుల్ ఓ భాగంలా మారిపోయింది. ఏ విషయం కావాలన్నా గూగుల్‌లో సెర్చ్ చేయడం మనకు కూడా అలవాటైపోయింది. ఏ ప్రదేశానికి వెళ్లాలన్నా గూగుల్ మ్యాప్ వాడుతుంటాం. అందుకే మన గురించి మన కంటే గూగుల్‌కే ఎక్కువ తెలుసుంటే అతిశయోక్తి కాదేమో.
మన స్మార్ట్ ఫోన్‌లో గూగుల్ మ్యాప్ ఆన్ చేసి ఉండటం వల్ల మనం ఎక్కడికి వెళ్తున్నామో, మనం ఏ పని చేస్తున్నామో గూగుల్ రికార్డు చేసేస్తుంది. మీ ఫోన్‌లో గూగుల్ యాడ్ పర్సనలైజేషన్ ఆన్ చేసి ఉంటే గూగుల్ మీ గురించి మొత్తం చెప్పేస్తుంది. మీ జెండర్, మీ ఇష్టాలు, మీరు వాడే వస్తువులు, మీరు చేసే పనుల గురించి మొత్తం చిట్టా గూగుల్ దగ్గర ఉంటుంది. ఒకవేళ మీ సమాచారం గూగుల్‌కు తెలియకూడదు అని మీరు భావిస్తే గూగుల్ యాడ్ పర్సనలైజేషన్ ఆఫ్‌లో పెట్టుకోవాలి. అసలు గూగుల్ మీ గురించి ఏమని చెప్తుందో మీకు తెలుసుకోవాలని ఉంటే.. ఈ లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి.