తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో నయనతారకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కమర్షియల్ ఓరియంటెడ్ రోల్స్ చేస్తూనే మరోవైపు డిఫరెంట్ స్టైల్‌లో లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేస్తోంది ఈ భామ. ఈ మధ్యనే డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ని పెళ్లి చేసుకుంది. అయితే.. రెండ్రోజుల క్రితం ఓటీటీలో తన మూవీని డైరెక్ట్‌గా రిలీజ్ చేశారు. నయన్ లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తుందంటే అందులో సమ్‌థింగ్ స్పెషల్ ఉంటుందని ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. మరి సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘ఓ2‘ మూవీ అయితే ప్రేక్షకుల నుంచి అంతకుమించిన అభిమానాన్ని పొందిందనే చెప్పుకోవచ్చు.
నయనతార కొడుకు వీర (రిత్విక్ జోతి రాజ్)కు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య ఉంటుంది. దీంతో ఆక్సిజన్ సిలిండర్ లేకపోతే తనకు ఊపిరి అందదు. అవయవ దానానికి సంబంధించిన ఆపరేషన్ కోసం చిత్తూరు నుంచి కొచ్చిన్‌కు బయలుదేరుతుంది. అయితే దారిలో వర్షం కారణంగా కొండచరియలు విరిగి బస్సుపై పడటంతో బస్సు రోడ్డుతో సహా 16అడుగులకు పైగా బురదలో కూరుకుపోతుంది.
పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో లేచిపోవాలనుకునే ఒక జంట, డ్రగ్స్ సప్లై చేసే ఒక పోలీసు, జ్యోతిషుడు చెప్పాడని కారులో కాకుండా బస్సులో ప్రయాణిస్తున్న ఒక ఎక్స్-ఎమ్మెల్యే ఇలా చాలా మంది ఆ బస్సులో ఉంటారు. మరి వీరిలో ఎంతమంది బతికారు? ఆక్సిజన్ కోసం ఒకరినొకరు చంపుకోవాల్సి వచ్చినప్పుడు వారి మానసిక స్థితి ఎలా మారింది? అసలు వారు బతికారా? ఇలాంటి వివరాలు తెలియాలంటే డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందే!
సినిమాలో కొన్ని డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటాయి. ‘దేవుడిచ్చిన లోపాన్ని కూడా తల్లి సరిచేయగలదు.’ అనే డైలాగ్ అందరి మనసులను దోచేస్తుంది. ఈ సినిమా కంప్లీట్‌గా నేచర్ నేపథ్యంలోనే సాగుతుంది. తొలుత టింబర్ డిపోల కోసం పెద్ద ఎత్తున చెట్లను నరకడం.. అందులో భాగంగా ఓ చెట్టుపై గూడుకట్టుకున్న పక్షి తన పిల్లలకు మేత తినిపించబోతుంటే ఆ చెట్టును నరకడంతో ఆ పిల్లలు చనిపోవడం.. వంటి సన్నివేశాలను గ్రాఫికల్‌గా చూపించారు.
ఇక.. ఆ పక్షి ఒక రాడికల్ (అప్పుడే మొలకెత్తిన మొలక)ని నోట పట్టుకుని వెళ్తుంటే .. ఊళ్లు, టౌన్లు, నగరాలు.. ఇలా అంతా కాలుష్యమయం అవుతూ కనిపించడం కూడా ఆ గ్రాఫికల్ బిట్‌లో చూడొచ్చు.. ఇదంతా ఫ్యూచర్‌ని వూహించుకుని తీసిన అద్భుత సన్నివేశంగా చెప్పుకోవచ్చు.. ఎందుకంటే చెట్లు లేక, ఫ్యాక్టరీల ఏర్పాటుతో మొత్తం కాలుష్యమయం అయితే.. అప్పుడు బతకడానికి కనీసం ఆక్సిజన్ లేకుండా పోయే పరిస్థితులు తలెత్తితే మానవుల పరిస్థితి ఎట్లుంటుంది? అనే కోణంలో ఈ సినిమాని అర్థం చేసుకోవాలి..
సినిమా మొదటి నుంచి చివరిదాకా చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. చివరలో కొన్ని సన్నివేశాలు అయితే అద్భుతంగా తీశారు. చివరికి పెద్ద పెద్ద కొండచరియలు విరిగిపడి.. భూమి చీల్చుకుని మట్టిలో కూరుకుపోయిన బస్సులో ఆక్సిజన్ కోసం గింజుకునే విధానం.. ఆఖరికి ఆ బస్సులో చిన్నపిల్లాడు తీసుకొచ్చిన మొక్క ఆకు తెంచుకుని ఫోన్‌లోని వైఫైని యాక్టివేట్ చేసే దాకా అంతా అద్భుతంగా ఉంటుంది.. ఈ సినిమా చూడకుండా మిస్ అయితే.. నిజంగా ప్రకృతి ప్రేమను అర్థం చేసుకోలేని వారు అవుతారు.