Tuesday, November 26, 2024

Exclusive | వినాయక చవితి ఏరోజు, 18 లేదా 19.. క్లారిటీ ఇచ్చిన పండితులు!

వినాయక చవితి ఏ రోజు నిర్వహించుకోవాలన్న విషయంలో చాలామందిలో సందిగ్ధం ఉండేది. ఈ విషయంలో క్లారిటీ ఇస్తూ ఓ ప్రకటన జారీ చేశారు పండితులు. వినాయక చవితి పర్వ దినాన్ని సెప్టెంబర్ 18వ తేదీన జరుపుకోవాలని తెలంగాణ విద్వత్సభ ఇవ్వాల (మంళవారం) ప్రకటించింది. శోభకృత్​నామ సంవత్సరం భాద్రపద శుక్ల చతుర్థి రోజునే మధ్యాహ్నం వరకు చవితి తిథి ఉన్నందున అదే రోజున వినాయక చవితిగా నిర్వహించుకోవాలని నిర్ధారించినట్టు విద్వత్సభ అధ్యక్షుడు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి, కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి తెలిపారు.

కాగా, చవితి తిథి 18న ఉదయం 9.58 ఆరంభమై 19వ తేదీ ఉదయం 10.28కి ముగుస్తుందని తెలిపారు. దీని ప్రకారం చవితి తిథి మధ్యాహ్నం 18వ తేదీన ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్​ కార్యాలయాలకు, ప్రభుత్వ సలహాదారులకు కూడా తెలియజేసినట్టు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement