హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. రాత్రి 9గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుందని ప్రకటించింది. కానీ వైన్ షాపులు, బార్లు, థియేటర్లలో ఆంక్షల సంగతిని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. బార్ల సమయం తగ్గించడం, థియేటర్లలో సీటింగ్ శాతం కుదించడం, శుభకార్యాల్లో హాజరయ్యే సంఖ్యపై పరిమితం విధించడం వంటి వాటి గురించి ఊసే లేదు. ఇక రాజకీయ ర్యాలీల గురించి సరే సరి. అటు విమానాల్లో రాష్ట్రంలోకి వస్తున్న ప్రయాణికులు.. రైలు, రోడ్డు మార్గాల్లో వచ్చే వారి తనిఖీ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పలేదు. సాధారణంగా జనసంచారం లేని సమయంలో నైట్ కర్ఫ్యూ విధిస్తూ హైకోర్టు గండం నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం ఆఘమేఘాల మీద నైట్ కర్ఫ్యూ విధించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement