Wednesday, November 20, 2024

ఏపీలో టెన్త్ పరీక్షల సంగతేంటి?

ఏపీలో ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. మరి టెన్త్ పరీక్షల సంగతేంటని విద్యార్థులు ఆందోళన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పదోతరగతి పరీక్షల నిర్వహణపై మే నెలాఖరులో స్పష్టత ఇస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు వి.చినవీరభద్రుడు వెల్లడించారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు, పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండగా.. ఉపాధ్యాయులు సహకారం అందించాల్సింది పోయి రాద్ధాంతాలు చేయడం సహేతుకం కాదని ఆయన వ్యాఖ్యానించారు. సీబీఎస్‌ఈ విధానం అమలులో భాగంగా 80% ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌, 20% ఎస్‌సీఈఆర్‌టీ సిలబస్‌ను పాఠ్యపుస్తకాల్లో పొందుపరుస్తామని చెప్పారు. ‘మనబడి నాడు-నేడు’ పథకం రెండో దశలో 16,400 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్లు చినవీరభద్రుడు తెలిపారు. కాగా షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి ఏపీలో టెన్త్ పరీక్షలు జరగాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement