పశ్చిమ ఆఫ్ఘానిస్థాన్ దేశంలోని ముక్వార్, క్వాదీస్ జిల్లాల్లో భూకంప సంభవించింది. ఈ ఘటనలో 26మంది మరణించారని ఆఫ్ఘాన్ అధికార ప్రతినిధి బాజ్ మొహమ్మద్ సర్వారీ వెల్లడించారు. కాగా మరణించిన వారిలో ఐదుగురు మహిళలు, నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైందని యూఎస్ జియాలజికల్ సర్వే వెల్లడించింది.బాద్ఘీస్ పశ్చిమ ప్రావిన్సు పరిధిలోని క్వాదీస్ జిల్లాలో ఇళ్ల పైకప్పులు మీద పడటంతో 26 మంది మరణించారు. తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత మొదటిసారి భూకంపం సంభవించింది. క్వాదీస్ ప్రాంతం గత 20 ఏళ్లుగా తీవ్ర కరవు పరిస్థితులతో అల్లాడుతోంది. కరవు కరాళ నృత్యం చేస్తున్న క్వాదీస్ ప్రాంతంలోని హిందూ కుష్ పర్వత రేంజ్ లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..