Sunday, November 24, 2024

బెంగాల్ దంగల్.. తొలి సమరం

బెంగాల్, అసోంలో తొలిదశ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు బంగాల్​లో 70.17 శాతం, అసోంలో 61.86 శాతం ఓటింగ్​ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఓటర్లు. బంగాల్​లో మొత్తం 73.80 లక్షల మంది ఓటింగ్​లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. 

దేశంలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో అందరి దృష్టి బెంగాల్‌పైనే నెలకొంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికలు అసక్తికరంగా మారాయి. శనివారం మొదటి విడతలో30 స్థానాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. బంగాల్​ శాసనసభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. తొలి విడతలో నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తొలి దశలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 73,80,942 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోను‌న్నారు. ఉదయం నుంచే ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. కరోనా మహమ్మారి వేళ గంట సమయం పొడగించారు. పశ్చిమ బెంగాల్‌లో చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. తొలి విడతలో 30 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతుంది.

బెంగా‌ల్‌లో తొలి‌దశ పోలింగ్‌ కోసం 7,061 పోలింగ్‌ స్టేషన్లు, 10,288 పోలింగ్‌ బూత్‌లు ఏర్పా‌టు ‌చే‌శారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ, అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద థర్మల్‌ స్కానర్లు, హ్యాండ్‌ శానిటైజర్లు, సబ్బులు.. సిబ్బందికి మాస్క్‌లు, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచారు. బెంగాల్‌ తొలి విడత ఎన్నికల్లో 191 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటుండగా.. 74లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.

తొలి విడత ఎన్నికల కోసం 684 కంపెనీల బలగాలను మోహరించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. పురులియా, బంకురా, జార్‌గ్రామ్‌, పుర్బా మేదినిపూర్‌, పశ్చిమ మేదినిపూర్‌లో ఎన్నికలు జరుగుతుండగా.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా బూత్‌కు 11 మంది చొప్పున పారామిలటరీ సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేశారు.

మరోవైపు అసోంలోనూ తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అసోంలో 47 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.  అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు  ఉండగా మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. 47 స్థానాలకు తొలివిడత ఓటింగ్ జరుగుతుండగా… అసోం సీఎం సోనోవాల్ మజులీ స్థానం నుంచి బరిలో ఉన్నారు. శాసనసభ సభాపతి హితేంద్రనాథ్ గోస్వామి జోరాట్ నుంచి, పీసీసీ అధ్యక్షుడు రిపున్బోరా గోపూర్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement