కొవిడ్ మహమ్మారి తర్వాత మనం కొత్త ప్రపంచం వైపు పయనిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఇవ్వాల లోక్సభలో ప్రధాని ప్రసంగిస్తూ.. దేశం 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటోందన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం ఒక పెద్ద మార్పును చూసింది.
ఇప్పుడు మనం జీవిస్తున్న కొత్త ప్రపంచ క్రమం కొవిడ్ -19 మహమ్మారి తర్వాత మనం ఎట్లుంటామో తెలియజేస్తుంది.. మహమ్మారి నుంచి కోలుకుని కొత్త ప్రపంచ క్రమం వైపు పయనిస్తున్నట్లు నేను స్పష్టంగా భావిస్తున్నా.. ఇది మనందరికీ ఒక మలుపు. అని ప్రధాని మోదీ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ దేశానికి స్ఫూర్తినిచ్చే అవకాశాన్ని అందించిందని ఒక దేశంగా మనం ఈ అవకాశాన్ని వదులుకోకూడదు.. మనం అమృత యుగంలోకి ప్రవేశిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.