Friday, November 22, 2024

వీడియో: పాల నదిని చూశారా?

యూకేలోని వేల్స్ నగరంలో దులైస్ అనే నది ఒకటి ఉంది. సిటీకి కాస్త దగ్గరగా ఉండటంతో నగర వాసులు అక్కడ రోజూ కాసేపయినా గడిపేందుకు అలవాటు పడ్డారు. రోజూ ఆ నదిలో నీరే పారుతుంటుంది. కానీ ఏప్రిల్ 14వ తారీఖున మాత్రం ఆ నదిలో పాలు పొంగిపొర్లాయి. కొన్ని గంటల పాటు అలా పాలు నదిలో పారుతూనే ఉన్నాయి. పాలు పారుతున్న నదిని చూసేందుకు జనాలు క్యూ కట్టారు.

అయితే, అసలు సంగతి తెలిసి అవాక్కయ్యారు. నదికి కాస్త దూరంలో ఓ భారీ పాల ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో దాంట్లో ఉన్న పాలన్నీ నదిలోకి ప్రవహించాయి. దీంతో ఆ పాలన్నీ నీళ్లపాలయ్యాయి. నదిలో పాల ప్రవాహాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement