Friday, November 22, 2024

ఈ ఎన్నికల్లో మేమెవరికీ సపోర్ట్ చేయట్లేదు.. స్పష్టం చేసిన రైతు సంఘాల నేత రాకేశ్ టికాయత్

‘‘మేము ఏ పార్టీకి సపోర్ట్ చేయడం లేదు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కొన్ని పార్టీలు తాము మద్దతు ఇస్తున్నట్టు ప్రకటిస్తున్నాయి. అవన్నీ అవాస్తవాలు. ’’ అని భారతీయ కిసాన్ యూనియ్ (BKU) లీడర్ రాకేశ్ టికాయత్ స్పష్టంచేశారు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు బీకేయూ రాజకీయ పార్టీలకు మద్దతునిస్తుందనే వార్తలను ఆయన ఖండించారు. పరేడ్ గ్రౌండ్‌లో రైతుల మూడు రోజుల ‘చింతన్ శివిర్’లో పాల్గొనడానికి మాగ్ మేళాకు వచ్చిన టికాయత్ మీడియాతో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్‌దళ్- సమాజ్‌వాదీ పార్టీ కూటమికి మద్దతు ఇవ్వాలని BKU అధ్యక్షుడు నరేష్ టికాయత్ విజ్ఞప్తి చేశారని వస్తున్న వార్తలతో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం.

అయితే.. సిసౌలిలో బీజేపీకి చెందిన సంజీవ్ బల్యాన్‌తో సమావేశమైన కొన్ని గంటల తర్వాత బికెయు చీఫ్ తన ప్రకటనను ఉపసంహరించుకున్నారు. తాను ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని చెప్పారు. రైతుల ‘చింతన్ శివిర్’లో రాకేష్ టికాయత్ మాట్లాడుతూ రైతుల సమస్యలపై చర్చించారు.”రైతులు, సంస్థకు సంబంధించిన పలు విషయాలు ఈ 3 రోజుల మేధోమథన సెషన్‌లో చర్చించాం” అని రాకేష్ టికాయత్ చెప్పారు.

తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వదిలేశారని ప్రభుత్వంపై BKU నాయకుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘దేశవ్యాప్త రైతుల ఆందోళన సమయంలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.. అది జరగలేదు. లఖింపూర్ ఖేరీ ఘటనలో మా ప్రజలను చాలా మంది జైలుకు పంపారు. హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా ఇప్పటికీ తన పదవిలో ఉన్నారు. ఇట్లాంటి వారు బయట తిరగడం చాలా పెద్ద సమస్య. ధాన్యాల సేకరణలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇట్లాంటి పలు అంశాలపై మేధోమథన సెషల్ చర్చించినట్టు’’ రాకేష్ టికాయత్ చెప్పారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా (ప్రస్తుతం రద్దు చేసిన) రైతులు 13 నెలలపాటు చేసిన ఆందోళన దేశ రైతుల ‘‘అతిపెద్ద విజయం’’ అని అభివర్ణించారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు రైతుల సంఘటిత ఆందోళన గురించే మాట్లాడుతున్నారు అని ఆయన అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement