ఎస్.. పోలీసులంటే ఒకప్పుడు బ్యాడ్ పర్సన్స్ అనే ఫీలింగ్ ఉండేది. కానీ, తెలంగాణ ప్రభుత్వం.. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన సంస్కరణలు, పలు రకాల చర్యలతో పోలీసులంటే ఇప్పడు చాలామందికి గుడ్ ఫీలింగ్ కలుగుతోంది. అయితే.. ఇంకా కొంతమంది తమ సహజ గుణాన్ని వదులుకోవడం లేదు కానీ, చాలామంది పోలీసులు మానవత్వాన్ని చాటుకునేలా వ్యవహరించడం కూడా పోలీసులంటే ప్రజలకు గౌరవం పెరిగేలా చేస్తోంది.
హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఓ ఇన్సిడెంట్ జరిగింది. ఎన్ ఐ ఏ నుంచి 100 ఫీట్స్ రోడ్డువైపు వస్తుంటే దారిలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ మహిళ స్కూటీ సడెన్‌గా ఆగిపోయింది. ఆమె ఎంత ట్రై చేసినా బండి స్టార్ట్ కావడం లేదు. ఇంతలో అక్కడ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఆమె దగ్గరకు పరుగున వచ్చి బండిని ఆమె చేతుల్లోంచి తీసుకుని కొంతదూరం తోసుకుంటూ వెళ్లాడు. ఆ తర్వాత ట్రాఫిక్‌కు అవాంతరం లేకుండా పక్కకి తీసుకెళ్లి బైక్‌ని కిక్ స్టార్ట్ చేశాడు. చాలా సేపు సతాయించిన బండి ఆయన దెబ్బకు పొగలు చిమ్ముతూ బుర్ మంటూ స్టార్ట్ అయ్యింది. అంతసేపు కంగారుగా ఉన్న ఆ మహిళ మోములో అప్పటికీ కానీ చిరునవ్వు వచ్చింది. అయితే.. తన పేరు చెప్పడానికి ముందు సంకోచించిన అతను.. ‘‘ఇబ్బందేమీ ఉండదండీ, మంచిపని చేశారు కదా’’.. అంటే తన పేరు నర్సింహారెడ్డి అనీ, మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా చేస్తానని తెలిపాడు. ఇలాంటి పోలీసులందరికీ మరోసారి హ్యాట్సాప్ చెబుదాం..
బెంగళూరులోనూ..
ఇక.. బెంగళూరులో కూడా ఇవ్వాల ఓ డిఫరెంట్ ఇన్సిడెంట్ కనిపించింది. అక్కడి రోడ్లు, వాటిపై అనేక కథనాలు ఇప్పటికే పత్రికల్లో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ట్రాఫిక్ ఇబ్బందులకు తోడు రోడ్లపై గుంతలు జనాల ప్రాణాలు తీస్తుంటాయి. కాగా.. బెంగళూరు సిటీలోని కోననకుంటె క్రాస్ నుంచి సారక్కి సిగ్నల్‌కు వెళ్లే రూట్లో కుమారస్వామి లేఅవుట్ ట్రాఫిక్ పోలీసు ఒకతను అక్కడున్న గుంతలో మట్టి పోస్తూ కనిపించాడు. ఇది చూసిన వాహనదారుడు ఆ ఫొటోని నెట్టింట షేర్ చేసుకున్నాడు. పనిలో పనిగా అతనికీ ఓ సెల్యూట్ చెప్పేద్దామా!