Friday, November 22, 2024

Story | పవార్​కి వెల్​కమ్​, షిండేకు బై బై.. బీజేపీ వ్యూహం ఇదే

రానున్న లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్, థాక్రే శివ‌సేన‌, కాంగ్రెస్ తో కూడిన‌ మ‌హా వికాస్ అఘాడీ కూట‌మి 35 స్థానాల‌కు పైగా సాధించే అవ‌కాశాలు ఉన్నాయంటే ఇటీవ‌ల విడుద‌లైన స‌ర్వేలు మ‌రాట్వా క‌మ‌ల‌నాధుల‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి.. దీంతో మ‌హారాష్ట్ర శివ‌సేన చీలిక వ‌ర్గం నేత, ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రి ఏకనాథ్ షిండేకు క‌టీఫ్ చెప్పే దిశ‌గా పావులు క‌దుపుతున్నది..

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

2023 ఫిబ్రవరి 18 నుంచి శివసేన అధ్యక్షుడిగా ఉన్న ఏక్‌నాథ్ షిండేకి ప్రస్తుతం మహారాష్ట్రలో అంత‌ అనుకూల పరిస్థితులు లేవు. ఏక్‌నాథ్ షిండే విధానాల వ‌ల్ల ఉద్ధవ్ థాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య థాక్రే ల‌కు పాపులార్టీ బాగా పెరిగింది . బీజేపీ అంతర్గత సర్వే ప్రకారం.. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీకి ష్ట్రంలోని 48 లోక్ సభ స్థానాల్లో 33 దాకా వస్తాయనే అంచనా ఉంది. మహారాష్ట్రను కోల్పోయేందుకు బీజేపీ హైకమాండ్ ఏమాత్రం సిద్ధంగా లేని బిజెపి స‌రికొత్త వ్యూహానికి తెర‌లేపింది..

- Advertisement -

ఆ పార్టీ సీనియ‌ర్ నేత , ఉప ముఖ్య‌ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్నావీస్ ఎన్నికల సమయంలో. షిండే ఉండటం కంటే. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మరాఠా వ్యక్తి ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో 35 శాతం మంది జనాభా మరాఠాలే. అందుకే మహారాష్ట్ర 21వ ముఖ్యమంత్రిగా ఎన్ సి పి సీనియ‌ర్ నేత‌ అజిత్ పవార్ గ‌ద్దెపై నిల‌పాల‌ని ఆలోచ‌న‌.. ఇందుకు ఎన్ సిపి ని చీల్చేందుకు అజిత్ ను పావుగా ప్ర‌యోగించాల‌ని చూస్తున్నారు.

ఇది ఇలా ఉంటే సుప్రీంకోర్టు ఫిరాయింపు తీర్పు ప్రకారం క్‌నాథ్ షిండే తలపై పార్టీ ఫిరాయింపు కత్తి వేలాడుతూ ఉంది. అందువల్ల ఏ క్షణంలోనైనా షిండే ఆ పదవి నుంచి తొలగక తప్పదు. తద్వారా సీఎం సీటు దక్కించుకోవాలన్న‌ది అజిత్ పవార్ కల . అందుకు బిజెపి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అజిత్ తో పాటు NCPలో ఉన్న‌ 35-40 మంది ఎమ్మెల్యేలు బిజెపి కి జైకొట్టునున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి..

ఇక అజిత్ పవార్‌కి లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తున్నా ఆ పార్టీ నేత శరద్ పవార్ ఆశీర్వాదం పొందాలని మద్దతు ఎమ్మెల్యేలు సూచిస్తున్నారు. 2019లో బీజేపీతో ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలి అనుకున్నప్పుడు.. 80 గంటలపాటూ.. తర్జనభర్జన నడిచింది. అందుకు కారణం శరద్ పవారే. ఆయనకు ఈ పొత్తు నచ్చలేదు..కాషాయ పార్టీతో చేతులు కలిపితే.. తన పొలిటికల్ కెరీర్‌కి బ్రేక్ పడినట్లే అవుతుందన్న శరద్ పవార్.. దీనిపై నువ్వే సొంత నిర్ణయం తీసుకో అని అజిత్ పవార్‌కి 2019లో సూచించారు. అజిత్ మద్దతుదారులు సైతం అప్పట్లో శరద్ పవార్ మాట వినాలని కోరారు. ప్రజల మూడ్ ఎలా ఉంటుందో.. ఆయనకు బాగా తెలుసని అన్నారు. అయినప్పటికీ అజిత్ పవార్ పార్టీని బీజేపీతో కలిపారు. రెండు పార్టీలూ కలిసి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పటి నుంచి శరద్ పవార్ యాక్టివ్ పాలిటిక్స్‌కి దూరంగానే ఉన్నారు. అందుకే ఇప్పుడు ఆయన ఆశీర్వచనాలు తీసుకోవాలని అజిత్ మద్దతుదారులు కోరుతున్నారు.

ఈ నేప‌థ్యంలోనే ఏప్రిల్ 8న అజిత్ పవార్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిశారు. ఆ సమయంలో పార్టీ నేతలు ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కారే కూడా అజిత్ వెంట ఉన్నారు. మంత్రి పదవుల పంపకాలను డిసైడ్ చేసేందుకే వారు వెళ్లారని తెలుస్తోంది. బీజేపీ వైపు నుంచి ఏక్‌నాథ్ షిండేను తొలగించేందుకు సిద్ధంగానే ఉన్నట్లు తెలిసింది. ఇక అజిత్ ప‌వార్ సిఎం కాబోతున్న వార్త‌ల నేప‌థ్యంలో థాక్రే వ‌ర్గం సీనియ‌ర్ నేత సంజ‌య్ రౌత్ నేడు ఎన్ సి పి అధ్య‌క్షుడు శ‌ర‌ద్ ప‌వార్ ను క‌లిశారు.. ఈ సంద‌ర్భ‌గా బిజెపితో త‌మ పార్టీ క‌లిసేది లేద‌ని శరద్ పవార్ తనతో చెప్పిన‌ట్లు రౌత్ వెల్ల‌డించారు.. అయితే బిజెపి ఎత్తుల‌పై ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఎన్ సిపి కి రౌత్ సూచించారు.. మ‌రికొన్ని రోజుల‌లో మ‌హారాష్ట్ర రాజ‌కీయాలు ర‌స‌వ‌త్తరంగా మార‌నున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement