భారత్‌కు చెందిన ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3 అంతరిక్ష నౌక ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై దిగనుంది. ఈ క్రమంలో ఒక్కో దశ దాటుకుంటూ జాబిలమ్మ వైపు ఆర్బిటార్ పయనిస్తోంది. ఇక మరో రెండ్రోజుల్లు భారత్ చరిత్ర సృష్టించనుందని తెలుస్తోంది. ఈ అంతరిక్ష నౌక హెల్త్ బాగానే ఉందని, చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇస్రో తెలియజేస్తోంది.
కాగా, చంద్రయాన్ -2 మిషన్‌కు నాయకత్వం వహించిన ఇస్రో మాజీ చీఫ్, కె శివన్ మాట్లాడుతూ “చివరిసారి (చంద్రయాన్ -2 సమయంలో) ల్యాండింగ్ ప్రక్రియ తర్వాత, మేము డేటాను పరిశీలించాము. దాని ఆధారంగా, దిద్దుబాటు చర్యలు తీసుకున్నాము. మేము సరిదిద్దిన దానికంటే ఎక్కువ చేసాము. ఎక్కడ మార్జిన్లు తక్కువగా ఉన్నాయో, మేము ఆ మార్జిన్లను మెరుగుపరిచాము… చంద్రయాన్ 2 నుండి మనం నేర్చుకున్న పాఠాల ఆధారంగా, చంద్రయాన్–3 వ్యవస్థ మరింత కఠినంగా సాగుతోంది” అన్నారు.
చంద్రయాన్-2తో.. ఆర్బిటర్ ల్యాండర్ విక్రమ్..
చంద్రునిపై సంచరిస్తున్న చంద్రయాన్-2 ఆర్బిటర్ అధికారికంగా చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్‌తో సంబంధాన్ని ఏర్పరచుకుంది. ఇస్రోకు ఇప్పుడు ప్రొపల్షన్ మాడ్యూల్ కాకుండా ల్యాండర్‌ను చేరుకోవడానికి మరో మార్గం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు ట్విట్టర్లో పోస్టు చేశారు..