Saturday, November 23, 2024

వీకెండ్ వచ్చేసింది.. బిగ్ బాస్ ఓటీటీలో ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరో తెలుసా?

ప‌క్కింట్లో ఏం జ‌రుగుతుందో అన్న ఉత్సాహం ప్ర‌తి ఒక్క‌రిలో ఉంటుంది. ఇది బేసిక్‌గా హ్యూమ‌న్ సైకాల‌జీ. అయితే ఈ వీక్‌నెస్‌ని బేస్ చేసుకుని ఏకంగా బిగ్‌బాస్ షో ర‌న్ అవుతుందంటే మీరు న‌మ్మ‌రు కావ‌చ్చు. కానీ, ఇది నిజం.. అయితే ఇత‌ర భాష‌లతోపాటు తెలుగులోనూ 5 సీజ‌న్లు కంప్లీట్ చేసుకుంది.. ఇక ఈసారి డిఫ‌రెంట్‌గా ఓటీటీలో 24/ 7 లైవ్ స్ట్రీమ్ అవుతోంది.. మీరు ఏ టైమ్‌లో చూసినా షో లైవ్ ర‌న్ అవుతూనే ఉంటుంద‌న్న‌మాట‌..

ఇక‌.. బిగ్ బాస్ వస్తున్నపుడు దాని గురించి చర్చ కూడా ఎక్కువగానే జరుగుతోంది. సోషల్ మీడియాలోనూ రచ్చ ర‌చ్చ అవుతోంది. మా వాడు సేఫ్ అవుతాడు.. మీ వాడు వెళ్లిపోతాడు అనే కామెంట్స్ పెరుగుతున్న‌య్‌. ఈ క్ర‌మంలోనే వీకెండ్ రావడంతో ఎలిమినేషన్ ప్రక్రియ కూడా జరగనుంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు అయితే ఓటింగ్ పరంగా అరియానా ముందుంది. ఈమెకు 29 శాతం వరకూ ఓటింగ్ జరిగింది. తొలి వారంలోనే తన రేంజ్ చూపించింది ఈ బ‌క్క పిల్ల‌.. ఈమెకు బయట కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. అరియానా తర్వాత ఆర్జే చైతూ ఉన్నాడు. ఈయనకు కూడా 14 శాతం ఓటింగ్ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ కుర్రాడు సేఫ్ జోన్‌లోనే ఉన్నాడు. మూడో స్థానంలో నటరాజ్ మాస్టర్ ఉన్నాడు. ఈయన కూడా సేఫ్‌గానే ఉన్నాడు. హమీదాకు కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. ఈ వారం డేంజర్ జోన్‌లో ఉన్నది ముగ్గురు. అందులో ముమైత్ ఖాన్, మిత్రా శర్మ, సరయు.. అయితే సరయు అప్పుడు కూడా మొదటి వారమే బయటికి వచ్చేసింది కాబట్టి ఈ సారి మరో చాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు ఆడియన్స్.

దాంతో కచ్చితంగా ఈమె సేఫ్ అయ్యేలా కనిపిస్తుంది. ముమైత్ ఖాన్ కూడా పాపులర్ కాబట్టి ఆమెకు కూడా సేఫ్ అయ్యే ఛాన్సులే ఎక్కువగా ఉన్నాయి. ఎటొచ్చీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని మిత్రా శర్మనే ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్న‌ట్టు పోలింగ్ ప‌ర్సంటేజ్‌ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ఈ అమ్మ‌డుకు చాలా తక్కువ ఓటింగ్ వచ్చినట్లు తెలుస్తుంది. మరి ఈ వారం ఎవరు బయటికి వస్తున్నారో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement