Saturday, November 23, 2024

ఢిల్లీలో వీకెండ్ క‌ర్ఫ్యూ ఎత్తివేత‌

దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌ర్ఫ్యూ ఆంక్ష‌లు విధించింది అక్క‌డి ప్ర‌భుత్వం. భారీ ఎత్తున క‌రోనా కేసులు న‌మోదు అవ్వ‌డంతో ఈ ఆంక్ష‌లు విధించింది కేజ్రీవాల్ ప్ర‌భుత్వం. తాజాగా రాజధానిలో కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు అదుపులోకి రావడం తో ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేజ్రీవాల్ సర్కార్. ఈ మేరకు పోలీసులు అలాగే వైద్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది కేజ్రీవాల్ సర్కార్. కాదా దేశ రాజధాని ఢిల్లీలో గడచిన 24 గంటల్లో 12,306 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే నిన్న ఒక రోజు 13785 మంది కరోనా నుంచి కోలుకున్నారు. పది రోజుల వ్యవధిలో… రోజువారి కరోనా కేసులు గరిష్టంగా 28 వేల నుంచి భారీగా తగ్గాయి. అటు ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య కూడా భారీగా తగ్గిందని ఆరోగ్య శాఖ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement