బల్లి పడిన మజ్జిగ తాగి పెళ్లి కుమారైతో సహా 16మంది అతిథులు హాస్పటల్ పాలైయ్యారు. ఈ సంఘటన రాజస్థాన్ భరత్ పుర్ జిల్లాలోని సిక్రీలోని పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిక్రీలోని ఓ గ్రామానికి చెందిన దిన్ మహ్మద్ కుమారుడు నిజాముద్దీన్‌కు మే 19న వివాహం జరిగింది. వివాహ అనంతరం జరిగిన ఓ కార్యక్రమానికి అతిథులు హజరయ్యారు. వారందరికీ మజ్జిగ అందించారు. ఈ క్రమంలో బల్లి పడిన మజ్జిగ తాగి 16 మంది అనారోగ్యం బారినపడ్డారు. అందులో వధూవరులు కూడా ఉన్నారు. వీరందరినీ హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. ముగ్గురి ఆరోగ్యం క్షీణించడం వల్ల వారిని ఆళ్వార్ ఆసుపత్రిలో చేర్చారు. చివరగా, కుటుంబ సభ్యులు మజ్జిగ కుండను ఖాళీ చేయగా, అందులో బల్లి ముక్కలై కనిపించింది. దాంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనతో పెళ్ళి ఇంట విషాదం నెలకొంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement