స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత జనాలు అంతా వెబ్ సిరీస్‌లు.. ఓటీటీల్లోనే సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ప్రేక్షకుల అంచనాలు, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చాలా వెబ్‌సిరీస్‌లు పలు ఓటీటీల్లో ఉన్నాయి. కాగా, వీటిలో హాట్‌స్టార్ డిస్నీ లో స్పెషల్స్‌లో భాగంగా వస్తున్న స్పెషల్ ఓపీఎస్ వెబ్ సిరీస్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది.
ఇక ఈ మధ్య వచ్చిన స్పెషల్ ఓపీఎస్ 1.5 సెకండ్ సీజన్‌లో కూడా చాలా ఇంట్రస్టింగ్ విషయాలున్నాయి. ప్రేక్షకులకు వెబ్ సిరీస్ లపై మక్కువ పెంచిన స్టోరీలలో “స్పెషల్ ఓపీఎస్”ది ఓ ప్రత్యేకమైన స్థానం అనే చెప్పుకోవచ్చు. ఇండియాలో ఉన్న ‘రా’ ఏజెంట్స్ పాకిస్తాన్ వంటి దేశాలలో ఏ విధంగా పని చేస్తారో, అండర్ కవర్ ఆపరేషన్స్ ఎలా నిర్వహిస్తారో… అన్న దాన్ని అద్భుతంగా తెరకెక్కించడంతో ‘స్పెషల్ ఓపీఎస్’ సిరీస్ ఇండియాలో సూపర్ హిట్ అయ్యింది.
పస్ట్ సీజన్‌లో 8 ఎపిసోడ్లతో ఈ వెబ్ సిరీస్ ఆకట్టుకునే స్టోరీ లైన్‌తో చాలా ఇంట్రస్టింగా సాగింది. దీనికి సంబంధించిన మూల కథనం ఏంటంటే.. ఇండియన్ రా ఏజెంట్‌కు సంబంధించిన స్టోరీ లైన్ ఇది.. రా ఏజెంట్లకు ఖర్చు చేసిన వివరాలను ఆడిట్ చేస్తున్నప్పుడు కొన్ని లెక్కలు ఆధారాలు లేకుండా ఉంటాయి. వాటికి సంబంధించి స్పెషల్ ఆఫీసర్ హిమ్మత్ సింగ్ నుంచి వివరాలు తెలుసుకోవాలని ఉన్నతాధికారులు కోరుతారు.
దీంతో టూ మెన్ కమిటీ స్పెషల్ ఆఫీసర్ హిమ్మత్‌ను పిలిపించి ఖర్చులు, దాని లెక్కల వివరాలు చెప్పాలని కోరడంతో.. తాను ఎక్కడి నుంచి నిధులు తీసుకున్నది.. ఎక్కడెక్కడ ఆపరేషన్స్ నిర్వహించి డబ్బులు ఖర్చుపెట్టిందనే వివరాలు చెబుతాడు.. ఈ క్రమంలో ఒక్కో అంశానికి సంబంధించి ఒక్కో స్టోరీ ఉంటుంది. ఈ విధానం అంతా చాలా ఇంట్రస్టింగ్‌గా ఎగ్జాయిటింగ్‌గా ఉంటుంది. తీవ్రవాదులను మట్టుబెట్టడంలో.. అంతర్గతంగా జరుగుతున్న లోపాలను వెలికితీయడంలో.. ఉగ్రవాద నిర్మూలన చర్యల్లో స్పెషల్ ఆఫీసర్‌గా హిమ్మత్ సింగ్ ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటాడనే అంశాలపై స్టోరీ రివీల్ అవుతుంది.. ఇదంతా ఫస్ట్ సీజన్లోని 8 ఎపిసోడ్స్‌లో ఉంటుంది..
తాజాగా ఈ సిరీస్ కు ప్రీక్వెల్ “స్పెషల్ ఓపీఎస్ 1.5” పేరుతో విడుదలైంది. మొదటి సిరీస్ లో అనేక అండర్ కవర్ ఆపరేషన్స్ ను విజయవంతంగా నిర్వహించిన హిమ్మత్ సింగ్ ఫ్లాష్ బ్యాక్ తదితర అంశాలతో ఈ ప్రీక్వెల్ రూపొందింది. అయితే మొదటి సీజన్లో ఉన్నతం కిక్కు ను ఈ 1.5 సీజన్ ఇవ్వలేదన్నది వీక్షకుల మాట.
దీనికి కారణం… అనేక అనేక ఆపరేషన్స్ ను వెంటవెంటనే స్క్రీన్ పై చూపించడంతో, ప్రేక్షకులు గందరగోళానికి గురవుతారు. ఒక లైన్ నుండి మరొక లైన్ ను అర్థం చేసుకోవడానికి తికమక పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మొదటి సీజన్ కు వచ్చిన క్రేజ్ తో ఈ 4 ఎపిసోడ్ల 1.5 సీజన్ చూడడానికి పెద్దగా ఇబ్బంది అనిపించదు. పైగా ఏదో ఇంట్రస్ట్ మ్యాటర్ ఉంటుందన్న ఆశతో అలా అలా అన్ని ఎపిసోడ్స్ ఆగకుండా చూడాల్సి ఉంటుందనడంలో సందేహం లేదు.
అయితే ఈ ఎపిసోడ్‌లో ప్రధానంగా హిమ్మత్ సింగ్ ఫ్రెండ్ విజయ్.. అతని భార్య.. హిమ్మత్ లవర్.. అండ్ స్పారో గర్ల్స్ కు సంబంధిచిన అంశాలు చాలా చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తాయి. పైగా ఫస్ట్ ఎపిసోడ్‌లో హిమ్మత్ సింగ్ భార్యకు సంబంధించిన పలు అంశాలను ఢిల్లీ పోలీసాఫీసర్ వెల్లడిస్తాడు..
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily