Tuesday, November 26, 2024

Weather: ఢిల్లీని కమ్మేస్తున్న పొగమంచు.. విమానాల రాకపోకలకు అంతరాయం

దీపావ‌ళి త‌ర్వాత ఢిల్లీలో వాతావ‌ర‌ణం వేగంగా మారిపోయిందని.. ఈ వారం రోజుల్లో పొగ‌మంచు బాగా ఎక్కువైంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మునుపెన్న‌డూ లేని రీతిలో న‌వంబ‌ర్‌లోనే ద‌ట్ట‌మైన పొగ‌మంచు అలుముకుంటోందని, అంతే కాకుండా తీవ్రమైన‌ పొల్యూష‌న్ స‌మ‌స్య కూడా ఎదుర‌వుతోంద‌ని తెలిపారు. దాదాపు 200 మీట‌ర్ల దూరం వ‌ర‌కు ఏమీ క‌నిపించ‌డం లేద‌ని.. మీట‌రు దూరంలో ఉన్న వ్య‌క్తులు, వాహ‌నాలు కూడా క‌నిపించ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో యాక్సిడెంట్లు జ‌రిగే ప్ర‌మాద‌ముంద‌ని ఢిల్లీ అధికారులు హెచ్చ‌రించారు.

కాగా, ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ బాగా దెబ్బ‌తింద‌ని, న‌వంబ‌ర్ 1 నుంచి 15 తేదీల మ‌ధ్య ప‌రిస్థితి మ‌రీ దారుణంగా మారింద‌ని ఢిల్లీ పొల్యూష‌న్ కంట్రోల్ క‌మిటీ (DPCC) తెలిపింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో ఉద‌యం 9గంట‌ల‌కు 454 స్థాయి ఉంద‌ని, గ‌త 24 గంట‌ల్లో 411 ఏఐక్యూ లెవ‌ల్స్ ఉన్న‌ట్టు అధికారులు తెలిపారు.

శుక్ర‌వారం ఉద‌యం ఉష్ణోగ్ర‌త‌లు 12.6 డిగ్రీల‌కు పడిపోయాయని, మార్నింగ్ టెంపరేచర్స్ మోడరేట్‌గా ఉంటున్నాయి. లో టెంప‌రేచ‌ర్స్ న‌మోదు అవుతున్న‌ట్టు ఐఎండీ తెలిపింది. అంతేకాకుండా ఇందిరా గాంధీ ఇంట‌ర్నేష‌నల్ ఎయిర్‌పోర్టు, స‌ప్ధార్‌గంజ్ ఎయిర్‌పోర్ట్ ఏరియాల్లో ద‌ట్ట‌మైన పొగ‌మంచు క‌మ్ముకుంటోంద‌ని, 300 నుంచి 500 మీట‌ర్ల దూరంలో వ‌స్తువులు, వ్య‌క్తులు క‌నిపించ‌డం లేద‌ని వాతావ‌ర‌ణ శాఖ అదికారులు తెలిపారు. దీంతో విమానాల రాక‌పోక‌ల‌కు కూడా అంత‌రాయం ఏర్ప‌డుతోంద‌న్నారు. గ‌త నాలుగేండ్ల‌లో ఎన్న‌డూ లేని ప‌రిస్థితులు ఈ నవ‌బంర్‌లో త‌లెత్తాయ‌ని సెంట‌ర్ ఫ‌ర్ సైన్సెస్ అండ్ ఎన్విరాన్‌మెంట్ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement