Friday, November 22, 2024

బంగాళాఖాతంలో అల్పపీడనం… తెలంగాణకు వర్ష సూచన

రుతుపవనాలు ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. నిన్న కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. నారాయణపేట జిల్లా మాగనూర్‌లో అత్యధికంగా 4.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నేడు, రేపు కూడా రాష్ట్రంలో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 21న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, మహారాష్ట్రపై గాలులతో 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండగా తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలుల ద్రోణి ఉన్నట్టు అధికారులు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement