Thursday, November 21, 2024

వెదర్ రిపోర్ట్: తెలంగాణలో భారీ వర్షాలు

తెలంగాణ‌ నైరుతి రుతుపవనాలు ప‌లు జిల్లాల్లో ప్ర‌వేశించాయి. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వరగంల్, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్లా తదితర జిల్లాల్లో భారీ వ‌ర్షం కురుస్తోంది. వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులపై నీళ్లు నిలిచాయి. వరంగల్‌తో పాటు హన్మకొండ, ఖాజీపేట సైతం జలమయమయ్యాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. హన్మకొండ తహసీల్దార్ కార్యాలయంలోకి నీరు చేరింది.

రానున్న‌ రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు పూర్తిగా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈనెల 11న ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణ‌లోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement