Friday, November 22, 2024

ప్రతాపం చూపిస్తున్న భానుడు.. పెరుగుతున్న వడగాలులు

తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఏపీ, తెలంగాణలో కొద్దిరోజులుగా ఎండలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో వడగాలులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఎండలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు
అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఏపీలో తూ.గో. జిల్లాలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది.

అటు ఆగ్నేయ దిశ‌ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో తెలంగాణలో ఎండల తీవ్రత కొన‌సా‌గు‌తోంది. గురు‌వారం సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35.4 డిగ్రీల నుంచి 38.5 డిగ్రీల మధ్య నమో‌ద‌య్యాయి. ఆది‌లా‌బాద్‌ జిల్లా తాంసిలో అత్యధికంగా 38.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత
రికార్డయింది. మరో‌వైపు మహ‌బూ‌బ్‌‌న‌గర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం కొత్తపల్లిలో 14.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణో‌గ్రత నమోదైందని టీఎ‌స్‌‌డీ‌పీ‌ఎస్‌ తెలి‌పింది. గ్రేటర్‌ హైద‌రా‌బా‌ద్‌లో రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెర‌గ‌ను‌న్నట్టు హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం అధి‌కా‌రులు
తెలి‌పారు. గత ఏడా‌దితో పోల్చితే ఎండల తీవ్రత ఈ సీజ‌న్‌లో తక్కు‌వ‌గానే ఉన్నట్టు చెప్పారు. గురు‌వారం హైదరాబాద్‌లో 36.4 డిగ్రీల గరిష్ఠ
ఉష్ణో‌గ్రత నమో‌దైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement