మారుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో తెలంగాణ సాహిత్యం ప్రపంచ వ్యాప్తంగా పరిచయం కావాల్సిన అవసరం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఓ యు సి ఐ పీ లో జరుగుతున్న మూడు రోజుల అంతర్జాతీయ సాహిత్య సదస్సు ప్రారంభ సమావేశం OUCIS కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఉదయం జరిగింది. దీనికి OUCIS డైరెక్టర్ డాక్టర్ కొండ నాగేశ్వర్ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి , తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ హాజరై ప్రసంగించారు. భారతదేశం వెలుపల స్థిరపడిన ప్రవాస భారతీయులు అనేక విషయాలపై దృష్టి పెట్టటం ద్వారా సాహిత్య అధ్యయనం జరపాలని, మరింత మెరుగైన రచనలు రావాలని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్యంలో ఉన్న అపురూపమైన విషయాలను ప్రపంచ సాహిత్యంలోకి, ముఖ్యంగా ఆంగ్ల సాహిత్యం లోకి అనువదించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో ప్రముఖ తెలంగాణ రచయిత ఆదేశ రవి, OU ఆర్ట్స్ డీన్ ప్రొఫెసర్ మురళీకృష్ణ , ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ కరుణాకర్, యుజిసి డీన్ ప్రొఫెసర్ మల్లేశం ,యశోద హాస్పిటల్స్ డాక్టర్ శశికాంత్, OUCIS డైరెక్టర్ డాక్టర్ కొండ నాగేశ్వర్ , ఇన్స్పైర్ హార్ట్ ఫౌండేషన్ చైర్మన్ లహరి, కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ప్రొఫెసర్ ముఖర్జీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేంద్రీయ, రాష్ట్రీయ విశ్వవిద్యాలయ ఆచార్యులు, వివిధ కళాశాల ఉపాధ్యాయులు, ఆచార్యులు, రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వివిధ అంశాలపై యాభైకి పైగా పరిశోధనా పత్రాలను సమర్పించడం జరిగింది. ఈ సాహిత్య సదస్సు మరో రెండు రోజులపాటు ఓ యు సి ఐ పి లో కొనసాగుతుందని డైరెక్టర్ డాక్టర్ కొండ పేర్కొన్నారు. కార్యక్రమంలో డీన్ ప్రొఫెసర్ మురళీకృష్ణ, అధ్యాపకులు క్రిస్టఫర్, విజయ, ప్రవీణ, సవీణ్ సౌదా, అశోక్ పరిశోధక విద్యార్థులు ఎల్చల దత్తాత్రేయ, బాలకృష్ణ, కిరణ్ తోటి విద్యార్థులు వివిధ రాష్ర్టాల పరిశోధక విద్యార్థులు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.