Saturday, November 23, 2024

కరోనాపై పోరు.. భారత్ కు యూకే మద్దతు

కరోనాతో విలవిల్లాడుతున్న భారత్‌ కు ప్రపంచ దేశాలు బాసటగా నిలుస్తున్నాయి. భారత్ కు అండగా ఉంటామని ఇప్పటికే ఎన్నోదేశాలు ప్రకటించాయి. తాజాగా మనదేశానికి సాయం అందించేందుకు బ్రిటన్ మందుకొచ్చింది. కరోనా సెకండ్ వేవ్‌తో పోరాడుతున్న భారత్‌కు వైద్య పరికరాలను పంపనున్నట్లు బ్రిటన్ ప్రకటించింది. వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ పంపించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఇండియాలో బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎలిస్ తెలిపారు. కరోనా కష్టకాలంలో భారత్‌కు అండగా నిలుస్తామని తెలిపారు. అందరం కలిసి కట్టుగా పోరాడి విజయం సాధిస్తామని పేర్కొన్నారు. భారత్ కు అవసరం అయిన వైద్య పరికరాలు, ఆక్సిజన్ లను పంపించినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా హిందీలో వీడియో సందేహం ఇచ్చారు. ప్రస్తుతం ఎలిస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, భారత్‌ లో బ్రిటన్‌ నూతన హైకమిషనర్‌ గా అలెక్స్‌ ఎలిస్‌ మూడు నెలల క్రితమే నియమితులయ్యారు.

యూకే పంపిస్తున్న ఈ వైద్య పరికరాలు కరోనాపై భారత్ చేస్తున్న పోరాటంలో కీలక భూమిక పోషించనున్నాయి. ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు.. గాలి నుంచి ఆక్సిజన్‌ను సేకరించి రోగులకు అందిస్తాయి. ఆస్పత్రి ప్రాంగణంలోనే వీటిని ఏర్పాటు చేసి ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగులకు నేరుగా అందించవచ్చు. తద్వారా ఎంతో మంది కరోనా రోగుల ప్రాణాలను కాపాడుకోవచ్చు.

మరోవైపు భారతదేశంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు, మరణాలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. నిత్యం లక్షల్లో కరోనా కేసులు నమోదవుతుండగా.. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. భార‌త్‌ లో క‌రోనా కేసులు ఊహించ‌ని రీతిలో పెరిగిపోతోన్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే అభివృద్ధి చెందిన ప‌లు దేశాలు భార‌త్‌కు సాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement